
జగన్‌ను కలిసిన వైఎస్సార్సీపీ గల్ఫ్ కమిటీ నేతలు
రాజంపేట: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహనరెడ్డిని గురువారం ఆయన స్వగహంలో వైఎస్సార్సీపీ గల్ఫ్ కమిటీ నేతలు కలిశారు. తమకు పదవులు కేటాయించి బాధ్యతలు అప్పగించినందుకు జగన్‌మోహనరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.
జగన్‌ను కలిసిన వారిలో వైఎస్సార్‌సీపీ గల్ఫ్ కమిటీ కన్వీనర్ బీహెచ్ ఇలియాస్, కువైట్ యూత్ లీడర్ మర్రి, కళ్యాణ్ ఉన్నారు. వైఎస్సార్‌సీపీ వైఎస్సార్ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి నేతృత్వంలో వారు జగన్‌ను కలిశారు. కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఐ కువైట్ సభ్యులు జీఎస్ బాబురాయుడు, షేక్‌నాసర్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.