
టెక్కలి: ప్రజల సంక్షేమం కోసం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నిరంతరం జనం మధ్య ఉంటూ శ్రమిస్తుంటే.. రాష్ట్రంలో టీడీపీ నేతలు మద్యం, మైన్స్, ఇసుక మాఫియాలతో ప్రజా ధనం కొల్లగొడుతున్నారని, ఈ ధర్మయుద్ధంలో ప్రతీకారం తీర్చుకునే సమయం ఆసన్నమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ భూమన కరుణాకరరెడ్డి అన్నా రు. టెక్కలి వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయ కర్త పేరాడ తిలక్ ఆధ్వర్యంలో సోమవారం నియోజకవర్గ కేం ద్రమైన టెక్కలిలో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ని ర్వహించారు. ముందుగా పూర్ణ కుంభంతో రాష్ట్ర నాయకులకు స్వాగతం పలికారు. అనంతరం వేదికపై దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తున్న జగన్‌మోహన్ రెడ్డిపై చం ద్రబాబు, మంత్రి అచ్చెన్నాయుడు రాక్షస దాడులు చేస్తున్నారని, వీరికి ప్రజలే గుణపాఠం చెప్పాలని కోరారు. దోచుకుంటున్న ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
ఏదీ ప్రజాపాలన?
అనంతరం మరో రీజనల్ కో ఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం చే స్తున్న అన్యాయాలను క్షేత్ర స్థాయిలో ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. రాష్ట్రంలో రౌడీయిజం తప్ప ప్రజా పాలన కనిపించడం లేదన్నారు. ధాన్యం కొనుగోలులో అన్యాయం జరుగుతోందని, సీఎం మాత్రం ఏమీపట్టనట్టు రాజధాని పేరుతో కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీకి నష్టం కలిగించే వ్యక్తులపై చర్యలు తప్పవన్నారు. అన్ని వర్గాల వారికి ప్రభుత్వ నిరంకుశ విధానాలు వివరించాలని సూచిస్తూ మత్స్యకారులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రస్తావించారు.
ఇంటింటికీ నారా వారి సారా
అనంతరం పార్టీ పార్లీమెంటరీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతా రాం మాట్లాడుతూ టీడీపీ నేతలు గ్రామస్థాయిలో కూలీల కడుపు కొడుతున్నారని ఆరోపించారు. మంత్రి అచ్చెన్న ఎన్నో కేసుల్లో నిందితుడిగా ఉన్నా పదవి వచ్చాక వాటి నుంచి విముక్తి పొందాడని తెలిపారు. చంద్రబాబు కేబినెట్‌లో అవినీతి అచ్చెన్న ఉండడం జిల్లా చేసుకు న్న పాపమని అన్నారు. ఇంటింటికీ నారా వారి సారా సరఫ రా చేస్తూ సంక్షేమాన్ని గాలికి వదిలేశారని దుయ్యబట్టారు.
రాక్షస పాలన
పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందన్నా రు. సంక్షేమ పథకాలు టీడీపీ కార్యకర్తల దోపిడీకి పనికి వస్తున్నాయని చురకలంటించారు. రాజ న్న పాలన జగన్‌తోనే సాధ్యమని తెలిపారు.
జగన్ వెంటే..
పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ధర్మాన కృష్ణదాసు మాట్లాడుతూ జగన్ సారథ్యంలో వైఎస్సార్‌సీపీ ప్రతిపక్ష పాత్రను సమర్థంగా పోషిస్తోందన్నారు. ప్రజాసంకల్ప యాత్రలో పార్టీ అధినేత ప్రజా సమస్యలను నిశితంగా తెలుసుకుంటున్నారని వివరించారు. వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా జగన్ నడుస్తున్నారని, ఆయన వెనుకే అంతా నడవాలని సూచించారు.
మాటలు మాత్రమేనా?
పార్టీ టెక్కలి నియోజకవర్గ సమన్వ య కర్త పేరాడ తిలక్ మాట్లాడు తూ మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గంలో పాలన గాలికి వదిలేసి జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నార ని వ్యాఖ్యానించారు. భావనపాడు హార్బర్ పేరుతో ఆయా ప్రాంత భూములను తన గుప్పెట్లో పెట్టుకున్నారని ఆరోపించారు. నందిగాంలో జూనియర్ కళాశాల, ఆఫ్‌షోర్ నిర్మాణంలో అబద్ధపు మాటలు చెప్పుకుంటూ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు.
బాబూ ఇదేనా నీ పాలనా అనుభవం?
టీడీపీ పాలనపై నిప్పులు చెరిగిన ధర్మాన
నరసన్నపేట: గ్రామాల్లో ఏకపక్ష పాలన చేస్తున్న టీడీపీ ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ రీజనల్ కో ఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు నిప్పులు చెరిగారు. గ్రామాల్లో సర్పంచ్‌లను కాదని జన్మభూమి కమిటీలతో పాలన సాగుతోందని, అ ర్హులకు పింఛన్లు అందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్ షాపుల్లో గతంలో 8 రకాల సరుకులు ఇస్తే ఇప్పుడు ఒక్కటే ఇస్తున్నారని గుర్తు చేశారు. ఇసుకపై ఇప్పటికీ స్పష్టమైన పాలసీ రాలేదన్నారు. ‘ఇదేనా బాబూ నీ పాలనా అనుభవం’ అంటూ సీఎంను సూటిగా ప్రశ్నిం చారు. నరసన్నపేటలో సోమవారం సాయంత్రం నియోజకవర్గ స్థాయి పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. కార్యక్రమంలో ధర్మాన స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. దేశంలో టీడీపీ లాంటి పాలన ఇంకెక్కడా లేదని, కనీస అవసరానికి కిరోసిన్ కూడా ఇవ్వలేని ప్రభుత్వం ఇదని దుమ్మెత్తిపోశారు.
ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొని వారికి మంత్రి పదవులు ఇవ్వడం ఎలాంటి అనుభవమన్నారు. నరసన్నపేటలో పార్టీ కార్యకర్తలు ఎప్పుడూ తమ వెంటే ఉన్నారని, ప్రభుత్వ నిరంకుశ విధానాలను వారే ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఇప్పటి నుంచే ఎన్నికల కోసం కష్టపడాలని సూచించారు. అనంతరం పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కార్యకర్తలు కృషి చేయాలన్నారు. రాజన్న పాలన జగన్‌తోనే సాధ్యమవుతుందని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు తమ్మినేని సీతారాం, మాజీ ఎమ్మెల్యే, పార్టీ రాజకీ య వ్యవహారాల రాష్ట్ర కమిటీ సభ్యులు ధర్మాన కృష్ణదాస్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి, జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ ధర్మాన పద్మప్రియలతో పాటు పలువురు ప్రసంగించి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు.
Comments
Please login to add a commentAdd a comment