వైఎస్సార్‌సీపీ నేత దారుణ హత్య | ysrcp leader of the brutal murder | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నేత దారుణ హత్య

Published Sat, May 16 2015 2:18 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM

వైఎస్సార్‌సీపీ నేత దారుణ హత్య - Sakshi

వైఎస్సార్‌సీపీ నేత దారుణ హత్య

వేట కొడవళ్లతోనరికి చంపిన ప్రత్యర్థులు
మహబూబ్‌నగర్ జిల్లాలో ఘటన

 
మన్ననూర్: కర్నూలు జిల్లా వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు వసంతరావు (54) శుక్రవారం దారుణహత్యకు గురయ్యారు. కర్నూలు జిల్లాలోని సున్నిపెంట నుంచి హైదరాబాద్‌కు కారులో వెళ్తుండగా మహబూబ్‌నగర్ జిల్లా అమ్రాబాద్ మండలం ఈగలపెంట వద్ద ప్రత్యర్థులు దారికాచి వేటకొడవళ్లతో నరికి చంపారు. పోలీసులు కథనం ప్రకారం.. సున్నిపెంట మండల కేంద్రానికి చెందిన వసంతరావు(54) సొంత పనిమీద హైదరాబాద్‌కు కారులో డ్రైవర్ శివతో కలసి బయలుదేరారు. ఆయన వాహనం ఈగలపెంటకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న హన్మకొండ వద్దకు రాగానే అప్పటికే మాటువేసి ఉన్న సుమారు 10 మంది వసంతరావుపై వేటకొడవళ్లతో ఒక్కసారిగా దాడి చేశారు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు.

వసంతరావు వైఎస్సార్‌సీపీలో చురుకైన నాయకుడు. మృతుడికి భార్య శైలజ తో పాటు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నా రు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈగలపెంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వసంతరావు మృతదేహాన్ని మహబూబ్‌నగర్ జిల్లా వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మంజూర్ అహ్మద్, కార్యదర్శి కొండూరి చంద్రశేఖర్‌తో పాటు స్థానిక నాయకులు సందర్శించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement