తాడిమర్రి (అనంతపురం జిల్లా) : రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు గుంటూరులో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షకు మద్దతుగా అనంతపురం జిల్లా తాడిమర్రిలో వైఎస్సార్‌సీపీ నేతలు ఆదివారం రిలే దీక్షలు ప్రారంభించారు. వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి శంకరరెడ్డి దీక్షలను ప్రారంభించారు. సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, పార్టీ నేతలు గంగులప్ప, కేశవరెడ్డి తదితరులు దీక్షలో పాల్గొన్నారు.