Relay strikes
-
బహుజనులపై కేసులు పెట్టేందుకు టీడీపీ నేతల కుట్ర
తాడికొండ: అమరావతి పరిరక్షణ సమితి పేరిట టీడీపీ నాయకులే కేసులు పెట్టాలని చెబుతూ రెచ్చగొడుతున్నారనే విషయం ఈనాడు పత్రిక సాక్షిగా బట్టబయలైందని బహుజన పరిరక్షణ సమితి నాయకులు అన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 71 రోజులుగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షల్లో బుధవారం పలువురు ప్రసంగించారు. మూడు రోజులుగా రాజధానిలో తిరిగిన టీడీపీ నాయకులు ‘29 గ్రామాల్లో ఉన్న 33 వేల మంది రైతులు రోడ్డు మీదకొస్తే బహుజన ఉద్యమం చేస్తున్న వారెవరూ బతకరు’ అని అంటున్నారంటే ఉద్యమానికి మద్దతు లేదనే కదా.. అని ప్రశ్నించారు. ఈ ప్రాంతంలో రెండు శాతం మంది రైతులు కూడా అమరావతి ఉద్యమానికి మద్దతు తెలపడం లేదనే నిజాన్ని టీడీపీ నాయకులు ఒప్పుకోవడం శుభపరిణామమన్నారు. దీక్షల్లో ఏఐసీసీ రాష్ట్ర కన్వీనర్ మల్లవరపు సుధారాణి, ఏపీ ఎంఆర్పీఎస్ అధ్యక్షురాలు బూదాల సలోమీ, బొందపల్లి గిరిజా, ఇందుపల్లి సుభాషిణి, ఎస్డీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మాదిగాని గురునాథం, నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు పరిశపోగు శ్రీనివాసరావు, దళిత వర్గాల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చెట్టే రాజు పాల్గొన్నారు. -
మూడు రాజధానుల కోసం బహుజన పోరాటం
తాడికొండ: మూడు రాజధానుల సాధన కోసం గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో చేపట్టిన రిలే దీక్షలు ఆదివారం 54వ రోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపిన వివిధ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ.. చంద్రబాబు తన వక్రబుద్ధి మార్చుకుని అన్ని ప్రాంతాల అభివృద్ధి, పాలనా వికేంద్రీకరణ లక్ష్యంగా మూడు రాజధానులకు మద్దతు ఇవ్వకపోతే దళిత, బహుజన సంఘాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. నిరుపేదలకు ఇళ్లు, ఇళ్ల పట్టాలు రాకుండా అడుగడుగునా అడ్డు తగలడం చంద్రబాబుకు, టీడీపీ నేతలకు తగదన్నారు. కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు వడిత్యా శంకర్‌నాయక్, చెట్టే రాజు, నూతక్కి జోషి, బూదాల సలోమీ తదితరులు పాల్గొన్నారు. -
‘అగ్రిగోల్ట్ బాధితులకు అండగా ఉంటాం’
సాక్షి, విజయవాడ : న్యాయం కోసం 20 లక్షల మంది అగ్రిగోల్ట్ బాధితులు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని వైఎస్సార్సీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. అగ్రిగోల్ట్ బాధితుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నాచౌక్‌లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన రెండో రోజు రిలే దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడుతూ.. అగ్రిగోల్ట్ ఆస్తులు కాజేయాడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని విమర్శించారు. ఇప్పటి వరకు బాధితులకు ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి సాయం కూడా అందలేదని ఆరోపించారు. 260మంది అగ్రిగోల్ట్ బాధితులు ఆత్మహత్య చేసుకుంటే కేవలం 143మందికి మాత్రమే పరిహారం ఇచ్చి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. బాధితుల జాబితా ఇప్పటి వరకు ఆన్లైన్లో పెట్టలేదన్నారు. అగ్రిగోల్ట్ బాధితుల సమస్యలపై వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రశ్నించారని గుర్తు చేశారు. కృష్ణా జిల్లాలో అగ్రిగోల్ట్ సంస్థకు వెయ్యి కోట్ల ఆస్తి ఉందని ఆరోపించారు. బాధితులకు అండగా ఉంటూ..న్యాయం జరిగేవరకు ప్రభుత్వంపై పోరాటాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు. -
పరిపాలన నీతిని విస్మరించొద్దు..
టీ జేఏసీ చైర్మన్ కోదండరాం దేవరుప్పుల(పాలకుర్తి) : ప్రజలను పరిపాలించే పాలకవర్గాలు మానవీయ కల్యాణం కోసం పరితపించాలే తప్ప పరిపాలన నీతిని విస్మరించొద్దని టీ జేఏసీ చైర్మన్ కోదండరాం సూచించారు. మండలంలోని చిన్నమడూరులో శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో మొక్కులు చెల్లిం చుకున్న అనంతరం సీతారాముల కల్యాణోత్సవ శోభాయాత్రను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలు సుభిక్షంగా ఉండేందుకు, పరిపాలన దక్షతకు నిదర్శనంగా వెలిసినవే ఆలయాలు అని అభివర్ణించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ వీరారెడ్డి సోమశేఖర్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, సర్పంచ్ మేడ సునీత, ఉత్సవ నిర్వాహక కమిటీ ప్రతినిధి శ్రీనివాస్, జనగామ టీ జేఏసీ కన్వీనర్ ఆకుల సతీష్ పాల్గొన్నారు. పేదోళ్ల అడ్డానే దొరికిందా ? జనగామ : పదహారేళ్లుగా నివాసముంటున్న ఏసీ.రెడ్డి నగర్ గుడిసె వాసులకు పట్టాలు ఇచ్చి, డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించాల్సిందేనని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. ఈ మేరకు గుడిసె వాసులు తలపెట్టిన రిలే దీక్షలు బుధవారం 59వ రోజుకు చేరుకోగా దీక్షా శిబిరాన్ని కోదండరాం సందర్శించి సంఘీభావం తెలిపి మాట్లాడారు. రాష్ట్రమంతటా శ్రీ సీతారాముల కల్యాణ వేడుకలు జరుగుతుంటే.. ఏసీ.రెడ్డి నగర్ వాసులు మాత్రం రోడ్డుపైకి రావాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. జనగామలో కలెక్టరేట్ నిర్మించుకునేందుకు చాలా చోట్ల స్థలాలు ఉన్నా.. పేద కుటుంబాలు నివసించే కాలనీపై కన్ను వేయడం దుర్మార్గమన్నారు. కలెక్టరేట్ కార్యాలయాన్ని ఇక్కడే నిర్మించాలనుకుంటే ముందుగా గుడిసె వాసులకు పక్కా ఇళ్లు కట్టించిన తర్వాతే పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కాగా, రాష్ట్రంలోని మంచిర్యాల, వేములఘాట్‌తో పాటు రాష్ట్రంలో అనేక చోట్ల నెలల తరబడి దీక్షలు జరుగుతున్నా స్వరాష్ట్రంలో పాలకులు పట్టించుకోక పోవడం బాధాకరమన్నారు. టీ జేఏసీ జిల్లా చైర్మన్ ఆకుల సతీష్, కోచైర్మన్‌ప్రొఫెసర్ పురుషోత్తం, కోడెం కుమార్, రామచంద్రం, బిట్ల శ్రీనివాస్, సీపీఎం నాయకులు బూడిద గోపి, ఎం.డీ.దస్తగిరి, ఆకుల లక్ష్మయ్య, కుమార్, జోగు ప్రకాష్, సుధాకర్, రవి పాల్గొన్నారు. -
కొడంగల్ బంద్ విజయవంతం
కొడంగల్ : నియోజకవర్గ విభజనకు నిరసనగా గురువారం పట్టణంలో నిర్వహించిన బంద్ విజయవంతమైంది. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు మూసివేశారు. అఖిలపక్షం, నియోజకవర్గ సాధన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు గురువారం నాటికి ఐదో రోజుకు చేరుకున్నాయి. ఉపాధి హామీ పథకం మేటీలు, కూలీలు సిరుసని శ్యాంసుందర్, నాయికోటి శ్రీనివాస్, కిష్టప్ప, ఆశప్ప, కాశప్ప, శ్రీనివాస్ తదితరులు దీక్షలో కూర్చున్నారు. వారికి పలు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, కేఎన్పీఎస్ నాయకులు సంఘీభావం తెలిపారు. నియోజకవర్గాన్ని ఒకటిగా ఉంచి పాలమూరు జిల్లాలో కొనసాగించాలని డిమాండ్ చేశారు. కొడంగల్‌ను డివిజన్ కేంద్రంగా ప్రకటించాలన్నారు. కొడంగల్ నుంచి ప్రభుత్వ కార్యాలయాలు తరలిపోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఇందనూర్ బషీర్, చంద్రప్ప, సోమశేఖర్, రమేష్‌బాబు, సురేష్‌లతో పాటు అఖిల పక్ష నాయకులు పాల్గొన్నారు. అఖిల పక్షం ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాలను, దుకాణాలను మూసివేయించారు. తెలంగాణా ప్రభుత్వం కొడంగల్‌కు చేసిన అన్యాయానికి అఖిల పక్షం నాయకులు శాంతియుతంగా నిరసన తెలిపారు. -
మాలీ సంఘం రిలే దీక్షలు వాయిదా
ఆదిలాబాద్ రిమ్స్ : కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఆదివారం తలపెట్టిన రిలే నిరాహార దీక్షలు వాయిదా వేసినట్లు మాలీమహా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్పెట్కులే, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఉమేశ్రావ్డోలేలు ఒక ప్రకటనలో తెలిపారు. గత వారం రోజులుగా జిల్లాలో చేపట్టిన నిరసనల్లో భాగంగా దీక్షలు చేపట్టాలని నిర్ణయించినప్పటికి, మంత్రి జోగురామన్న సీఏం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో దీక్షలు వాయిదా వేశామన్నారు. హరితహారం కార్యక్రమం కొనసాగుతుండడంతో ఈనెల చివరి వరకు అపాయింట్మెంట్ ఇప్పిస్తామని చెప్పినట్లు పేర్కొన్నారు. దీక్షలు తాత్కాలికంగా వాయిదపడ్డాయిని మాలీలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. -
జిందాల్ కార్మికుల రాస్తారోకో
అప్పన్నపాలెం(కొత్తవలసరూరల్): జిందాల్ పరిశ్రమను వెంటనే తెరిపించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు పరిశ్రమ వద్ద చేపట్టిన రిలే దీక్షలు బుధవారం నాటికి మూడోరోజుకు చేరుకున్నాయి. ఇంతవరకూ ప్రజాప్రతినిధులు, అధికారులు, కంపెనీ యాజమాన్యం స్పందించలేదు. దీనికి నిరసనగా కార్మికులంతా విశాఖ-అరకు రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం విద్యుత్ రాయితీ ప్రకటించినా కంపెనీ తెరిచేందుకు యాజమాన్యం ముందుకు రావడంలేదని కార్మికులు మండిపడ్డారు. కార్మికులు రోడ్డుకు అడ్డంగా నిలబడి ఆందోళనకు దిగడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. పోలీసులు చేరుకుని ట్రాఫిక్ నియంత్రించారు. కంపెనీ ఎంప్లాయీస్ ఆర్ఎస్ఎన్మూర్తి, వీఎస్ఆర్ రాజు, చిన్నారావు, ఆర్ ఈశ్వరరావు, పలువురు కాంట్రాక్ట్ వర్కర్లు దీక్షా శిబిరంలో కూర్చున్నారు. -
నక్సలిజం వస్తే బాగుండును: రేవంత్‌రెడ్డి
నిజామాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం నిజామాబాద్ కలెక్టరేట్ ముందు... ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై కేసు నమోదు చేయాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి ఏం మాట్లాడారంటే.. తెలంగాణ రాష్ట్రంలో బిహార్ మాదిరిగా అరాచక పాలన నడుస్తోంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడింది. ప్రజలంతా అఖిలపక్షంగా ఏర్పడి అరాచకాలపై పోరాటం చేయాలి. ఒకప్పుడు నక్సలిజం అనేది అభివృద్ధి విరోధకంగా ఉండేదనుకున్నాను. కానీ, ప్రస్తుతం తెలంగాణలో నక్సలిజం వస్తే బాగుండును. యూనివర్సిటీల్లోని యువత నక్సలిజం వైపు మొగ్గు చూపుతోంది. సాగర్, శృతి ఇలానే నక్సలిజంలోకి వెళ్లి వరంగల్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందారు. కేసీఆర్ వచ్చిన తొమ్మిది నెలల్లోనే ఎన్కౌంటర్ జరిగింది. నెల క్రితం ఆర్మూరులో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడానికి ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కారణమని' అన్నారు. -
15న కలెక్టరేట్ల ఎదుట బీసీల రిలేదీక్షలు
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాపులను బీసీల్లో చేర్చే ప్రయత్నాలకు నిరసనగా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పిలుపుమేరకు ఈ నెల 15న రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు శనివారం తెనాలిలో పిలుపునిచ్చారు. బీసీ కులాల వారు పెను ప్రమాదంలో ఉన్నారని, పార్టీలకతీతంగా బీసీలు ఏకమై ఉద్యమానికి మద్దతుగా రిలే దీక్షలు చేపట్టి, కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలని ఆయన సూచించారు. కాపుల సామాజిక, ఆర్ధిక పరిస్థితులపై నిష్పక్షపాతంగా సమగ్రమైన శాస్త్రీయ సర్వే చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీల్లో అభద్రతా భావాన్ని తొలగించడానికి బీసీ సంఘ నాయకులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చర్చలు జరపాలని కోరారు. ముఖ్యమంత్రి స్పందించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, తరువాతి పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని శంకరరావు హెచ్చరించారు. -
కాపు నేతలపై కేసులు నమోదు
పిఠాపురం : కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ దీక్షకు సంఘీభావంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో దీక్షలు చేపట్టిన పలువురు కాపు నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పిఠాపురం పట్టణంతో పాటు గొల్లప్రోలు నగర పంచాయతీ కొత్తపల్లి, గొల్లప్రోలు, పిఠాపురం మండలాల్లో సుమారు 250 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. 144 సెక్షన్ అమలులో ఉండగా ప్రదర్శనలు, రిలే నిరాహార దీక్షలు, నిరసనలు జరిపి చట్టాన్ని ఉల్లంఘించారన్న అభియోగాలపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. కొద్దిసేపు కాపు నాయకులకు, పోలీసులు మధ్య వాగ్వాదం జరిగింది. అరట్లకట్టలో 43 మందిపై.. కరప : అరట్లకట్టలో దీక్షలు చేపట్టిన 43 మందిపై కరప పోలీసులు కేసు నమోదు చేశారు. వీరందరిపై కేసులు నమోదుచేసినట్టు ఏఎస్సై అడబాల గంగరాజు తెలిపారు. గోపాలపురంలో రావులపాలెం : గోపాలపురం కాపు కల్యాణ మండపంలో శుక్రవారం రిలే దీక్షలు చేపట్టిన 12 మందిపై కేసులు నమోదు చేసినట్టు ఎస్సై పీవీ త్రినాథ్ శుక్రవారం తెలిపారు. వీఆర్వోలు ఇచ్చిన నివేదిక మేరకు ఆకుల రామకృష్ణ, మరో 11 మంది పై కేసులు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు. వాడపాలెంలో 12 మందిపై.. కొత్తపేట : వాడపాలెంలో దీక్షలు చేపట్టిన కాపు యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారంతా నిబంధనలు ఉల్లంఘించారని ఎస్సై డి.విజయకుమార్ తెలిపారు. -
జగన్ దీక్షకు మద్దతుగా రిలే దీక్షలు
తాడిమర్రి (అనంతపురం జిల్లా) : రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు గుంటూరులో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షకు మద్దతుగా అనంతపురం జిల్లా తాడిమర్రిలో వైఎస్సార్సీపీ నేతలు ఆదివారం రిలే దీక్షలు ప్రారంభించారు. వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి శంకరరెడ్డి దీక్షలను ప్రారంభించారు. సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, పార్టీ నేతలు గంగులప్ప, కేశవరెడ్డి తదితరులు దీక్షలో పాల్గొన్నారు. -
ఆర్టీసీ కార్మికుల రిలే దీక్షలు
దుబ్బాక (మెదక్ జిల్లా) : పెండింగ్‌లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీఎస్ఆర్టీసీ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం దుబ్బాక డిపో ఎదుట కార్మికులు నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ నిరాహార దీక్షలను ఎంప్లాయిస్ యూనియన్ హైదరాబాద్ జోనల్ అధ్యక్షులు జీ. శేషన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీలో అద్దె బస్సుల ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని, ఎస్ఆర్బీఎస్, ఎస్బీటీ, సీసీఎస్ లోన్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 2012, 13, 14 సంవత్సరాలకు సంబంధించిన లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ ఇవ్వాలని, 01.07.2015 నుంచి కార్మికులకు ఇవ్వాల్సిన డీఏ ఏరియర్స్‌ను విడుదల చేయడంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కండక్టర్, డ్రైవర్, శ్రామిక్ మెకానిక్, ఆర్టీసీ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ చేయడం లేదన్నారు. సాంకేతిక కారణాలతో మిగిలిపోయిన కాంట్రాక్టు కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఎంప్లాయిస్ యూనియన్ యాజమాన్యం ముందు పెట్టిన సమస్యలను పరిష్కరించకుంటే కార్మికులతో కలిసి రిలే దిక్షలను నిరవధిక దీక్షలకు దిగుతామని ఆయన హెచ్చరించారు. కార్మికుల దీక్షలకు ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి మచ్చ శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆస శరభయ్య తదితరులు మద్దతు ప్రకటించారు. ఈ దీక్షల్లో ఎంప్లాయిస్ యూనియన్ డిపో కార్యదర్శి పీఎస్ నారాయణ, అధ్యక్షులు రవీందర్, నాయకులు రమేశ్, బాలమల్లు, అశోక్, నర్సింహులు, కనకయ్య, సుధాకర్, ఎల్లయ్య, సత్తయ్య, నాంపల్లి, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
'గోస్పాడును కరువు ప్రాంతంగా ప్రకటించాలి'
గోస్పాడు (కర్నూలు) : కర్నూలు జిల్లాలోని గోస్పాడు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి, సహాయ చర్యలు ప్రారంభించాలని సీపీఎం మంగళవారం నుంచి రిలే దీక్షలకు దిగింది. మండలంలో కరువు పరిస్థితులు అలుముకోవడంతో రైతులు, వ్యవసాయ కూలీలు అవస్థలు పడుతున్నారు. దీంతో పలువురు బాధితులు సీపీఎం ఆధ్వర్యంలో రిలే దీక్షలకు దిగారు. -
గార్బేజీ కార్మికుల సమస్యలపై రిలే దీక్షలు
అనంతపురం : గార్బేజీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూసీ సోమవారం అనంతపురం జల్లా కేంద్రంలో ధర్నాకు దిగింది. తొమ్మిది నెలలుగా చెల్లించని వేతనాలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే 18 ఏళ్లుగా పనిచేస్తున్నవారిని కార్మికులుగా గుర్తించి పీఎఫ్, ఇఎస్‌ఐల సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. -
అలుపెరగని పోరు
సాక్షి, నెల్లూరు: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే లక్ష్యంతో సింహపురి వా సులు అలుపెరగని పోరాటం సాగిస్తున్నారు. యూపీఏ ప్రభుత్వ మెడలు వం చడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. నిరసన కార్యక్రమాలతో జిల్లా ను హోరెత్తిస్తున్నారు. 25వ రోజు ఉద్యమాన్ని శనివారం ఉధృతంగా కొనసాగించారు. నెల్లూరులోని కనకమహల్ సెంటర్లో వాణిజ్యపన్నుల శాఖ ఉద్యోగులు రాస్తారోకో చేయగా, విద్యుత్ శా ఖ ఉద్యోగులు రిలేదీక్షలు చేశారు. ఎన్జీఓలు, విద్యాశాఖ మినీస్టీరియల్ సిబ్బం ది, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో మ హాప్రదర్శన నిర్వహించారు. గెజిటెడ్ ఆ ఫీసర్లు, ఉద్యోగ సంఘాల ఉద్యమ కా ర్యాచరణను ఏజేసీ పెంచలరెడ్డి ప్రకటించారు. నారాయణరెడ్డిపేట, కొత్తకాలువ సెంటర్లో జరిగిన నిరసన కార్యక్రమాలకు టీడీపీ పొలిట్‌బ్యూరో స భ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర హాజరయ్యారు. ముత్తుకూరులో రాస్తారోకో, ఏపీ జె న్కో ప్రాజెక్టులో ఉద్యోగులు ధర్నా చేశా రు. టీపీగూడూరులో విద్యార్థులు మా నవహారం నిర్వహించారు. సాలిపేట సెంటర్లో మోకాళ్లపై నిలుచుని నిరస న తెలిపారు. ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో హైవేపై వెంకటాచలం వద్ద వంటావార్పు చేపట్టారు. విజయమ్మ దీక్షను భగ్నం చేయడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో గూడూరులో బంద్ జరిగింది. కా శీపేట, రాజావీధి, ఆర్టీసీ సెంటర్లలోని దుకాణాలను వ్యాపారులు స్వచ్ఛం దంగా మూసేశారు. ఆర్టీసీ బస్టాండ్, పాతబస్టాండ్ సెంటర్లలో ర్యాలీలు, రా స్తారోకోలు జరిగాయి. వెంకటగిరిలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట అన్ని శాఖల సిబ్బంది రిలేదీక్షలు చేపట్టారు. వారికి జేఏసీ నాయకులు సంఘీభావం తెలిపారు. వెంకటగిరి తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో నిరాహారదీక్ష చేపట్టారు. ఉదయగిరిలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. వరికుంటపాడులో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు వం టా వార్పు నిర్వహించారు. కలిగిరిలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. గ్రంథాలయం సమీపం లో రిలేదీక్షలు చేపట్టారు. కొండాపురం లో యూటీఎఫ్ ఆధ్వర్యంలో రాస్తారో కో జరిగింది. చిల్లకూరులో జర్నలిస్టులు రాస్తారోకో నిర్వహించారు. టోల్‌ప్లాజా ఉద్యోగులు నిరసనను రెండో రోజు కొనసాగించా రు. వాకాడులో ధర్నా నిర్వహించారు. కోట మండలం కొత్తపాళెం, కొక్కుపాడుతో పాటు చిట్టమూరులోనూ ర్యాలీలు జరిగాయి. సూళ్లూరుపేట జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నా యి. తహశీల్దార్ కార్యాలయం ఎదుట ముస్లిం యువకులు రిలే నిరాహారదీ క్షలు చేస్తున్నారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో సుమారు 10 బస్సులతో ర్యాలీ నిర్వహించారు. జేఏసీ, వైఎస్సార్సీపీ రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నా యి. యువకులు చేస్తున్న ఆమరణ ని రాహారదీక్షను పోలీసులు భగ్నం చేశా రు. వైఎస్సార్సీపీ తడ మండల కన్వీనర్ మారంరెడ్డి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులతో జాతీయరహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దొరవారిసత్రంలో పార్టీ జిల్లా స్టీరింగ్ కమి టీ సభ్యుడు దువ్వూరు బాలచంద్రారెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్ష ప్రారంభమైంది. దీక్ష లో ఉన్న వారికి పార్టీ సమన్వయకర్తలు నెలవల సుబ్రమణ్యం, కిలివేటి సంజీవయ్య సంఘీభావం తెలిపారు. ఆత్మకూరు మున్సిపల్ బస్టాండులో మహిళలు రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. విద్యార్థులతో పట్టణంలో భారీ ర్యాలీ జరిగింది. కావలిలోని పొట్టిశ్రీరాములుబొమ్మ సెంటర్ వద్ద రిలే దీక్షలో ఉన్నవారికి వైఎస్సార్సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు కాకాణి గోవర్థన్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. ఏరియా వైద్యశాల సెంటర్లో సమైక్యాంధ్ర పరిరక్షణసమితి ఆధ్వర్యంలో దీక్షలో ఉన్న వారికి టీడీపీ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బీద రవిచంద్ర సంఘీభావం ప్రకటించారు.