గోస్పాడు (కర్నూలు) : కర్నూలు జిల్లాలోని గోస్పాడు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి, సహాయ చర్యలు ప్రారంభించాలని సీపీఎం మంగళవారం నుంచి రిలే దీక్షలకు దిగింది. మండలంలో కరువు పరిస్థితులు అలుముకోవడంతో రైతులు, వ్యవసాయ కూలీలు అవస్థలు పడుతున్నారు. దీంతో పలువురు బాధితులు సీపీఎం ఆధ్వర్యంలో రిలే దీక్షలకు దిగారు.