జిందాల్ పరిశ్రమను వెంటనే తెరిపించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు పరిశ్రమ వద్ద చేపట్టిన రిలే దీక్షలు
అప్పన్నపాలెం(కొత్తవలసరూరల్): జిందాల్ పరిశ్రమను వెంటనే తెరిపించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు పరిశ్రమ వద్ద చేపట్టిన రిలే దీక్షలు బుధవారం నాటికి మూడోరోజుకు చేరుకున్నాయి. ఇంతవరకూ ప్రజాప్రతినిధులు, అధికారులు, కంపెనీ యాజమాన్యం స్పందించలేదు. దీనికి నిరసనగా కార్మికులంతా విశాఖ-అరకు రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం విద్యుత్ రాయితీ ప్రకటించినా కంపెనీ తెరిచేందుకు యాజమాన్యం ముందుకు రావడంలేదని కార్మికులు మండిపడ్డారు. కార్మికులు రోడ్డుకు అడ్డంగా నిలబడి ఆందోళనకు దిగడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. పోలీసులు చేరుకుని ట్రాఫిక్ నియంత్రించారు. కంపెనీ ఎంప్లాయీస్ ఆర్‌ఎస్‌ఎన్‌మూర్తి, వీఎస్‌ఆర్ రాజు, చిన్నారావు, ఆర్ ఈశ్వరరావు, పలువురు కాంట్రాక్ట్ వర్కర్లు దీక్షా శిబిరంలో కూర్చున్నారు.