దీక్షలో పాల్గొన్న దళిత సంఘాల నేతలు
తాడికొండ: అమరావతి పరిరక్షణ సమితి పేరిట టీడీపీ నాయకులే కేసులు పెట్టాలని చెబుతూ రెచ్చగొడుతున్నారనే విషయం ఈనాడు పత్రిక సాక్షిగా బట్టబయలైందని బహుజన పరిరక్షణ సమితి నాయకులు అన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్‌లో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 71 రోజులుగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షల్లో బుధవారం పలువురు ప్రసంగించారు.
మూడు రోజులుగా రాజధానిలో తిరిగిన టీడీపీ నాయకులు ‘29 గ్రామాల్లో ఉన్న 33 వేల మంది రైతులు రోడ్డు మీదకొస్తే బహుజన ఉద్యమం చేస్తున్న వారెవరూ బతకరు’ అని అంటున్నారంటే ఉద్యమానికి మద్దతు లేదనే కదా.. అని ప్రశ్నించారు. ఈ ప్రాంతంలో రెండు శాతం మంది రైతులు కూడా అమరావతి ఉద్యమానికి మద్దతు తెలపడం లేదనే నిజాన్ని టీడీపీ నాయకులు ఒప్పుకోవడం శుభపరిణామమన్నారు. దీక్షల్లో ఏఐసీసీ రాష్ట్ర కన్వీనర్ మల్లవరపు సుధారాణి, ఏపీ ఎంఆర్‌పీఎస్ అధ్యక్షురాలు బూదాల సలోమీ, బొందపల్లి గిరిజా, ఇందుపల్లి సుభాషిణి, ఎస్‌డీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మాదిగాని గురునాథం, నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు పరిశపోగు శ్రీనివాసరావు, దళిత వర్గాల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చెట్టే రాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment