నక్సలిజం వస్తే బాగుండును: రేవంత్‌రెడ్డి
నిజామాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం నిజామాబాద్ కలెక్టరేట్ ముందు... ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై కేసు నమోదు చేయాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షల్లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి ఏం మాట్లాడారంటే.. తెలంగాణ రాష్ట్రంలో బిహార్ మాదిరిగా అరాచక పాలన నడుస్తోంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడింది. ప్రజలంతా అఖిలపక్షంగా ఏర్పడి అరాచకాలపై పోరాటం చేయాలి. ఒకప్పుడు నక్సలిజం అనేది అభివృద్ధి విరోధకంగా ఉండేదనుకున్నాను. కానీ, ప్రస్తుతం తెలంగాణలో నక్సలిజం వస్తే బాగుండును. యూనివర్సిటీల్లోని యువత నక్సలిజం వైపు మొగ్గు చూపుతోంది. సాగర్, శృతి ఇలానే నక్సలిజంలోకి వెళ్లి వరంగల్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. కేసీఆర్ వచ్చిన తొమ్మిది నెలల్లోనే ఎన్‌కౌంటర్ జరిగింది. నెల క్రితం ఆర్మూరులో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడానికి ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కారణమని' అన్నారు.