కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఆదివారం తలపెట్టిన రిలే నిరాహార దీక్షలు వాయిదా వేసినట్లు...
ఆదిలాబాద్ రిమ్స్ : కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఆదివారం తలపెట్టిన రిలే నిరాహార దీక్షలు వాయిదా వేసినట్లు మాలీమహా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్‌పెట్కులే, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఉమేశ్‌రావ్‌డోలేలు ఒక ప్రకటనలో తెలిపారు. గత వారం రోజులుగా జిల్లాలో చేపట్టిన నిరసనల్లో భాగంగా దీక్షలు చేపట్టాలని నిర్ణయించినప్పటికి, మంత్రి జోగురామన్న సీఏం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో దీక్షలు వాయిదా వేశామన్నారు. హరితహారం కార్యక్రమం కొనసాగుతుండడంతో ఈనెల చివరి వరకు అపాయింట్‌మెంట్ ఇప్పిస్తామని చెప్పినట్లు పేర్కొన్నారు. దీక్షలు తాత్కాలికంగా వాయిదపడ్డాయిని మాలీలు ఈ విషయాన్ని గమనించాలన్నారు.