హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ఏపీ బడ్జెట్ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో.. బడ్జెట్ అన్నివర్గాల ప్రజలను నిరాశపరిచిందంటూ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు చాంద్ బాషా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కె. శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. ఏపీ బడ్జెట్ విషయంలో టీడీపీ సర్కార్ అంకెల గారడీ చేసిందంటూ వారు ధ్వజమెత్తారు. డ్వాక్రా రుణమాఫీ, నిరుద్యోగభృతి వంటి అంశాల ప్రస్తావన లేదని విమర్శించారు. గృహ నిర్మాణానికి కనీస కేటాయింపులు కూడా లేవని మండిపడ్డారు.
సింగపూర్ లాంటి రాజధాని నిర్మిస్తామని చెప్పిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టణాభివృద్ధిశాఖతో కలిపి రాజధాని నిర్మాణానికి కేవలం రూ. 3వేల కోట్లు కేటాయించడం ప్రజలను మభ్యపెట్టడమేనని చెప్పారు. ఏపీ బడ్జెట్ లోటు పూడ్చుకునేందుకు ప్రజలపై పన్నుల భారం మోపుతారామోనని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు విమర్శించారు.
అన్ని వర్గాలకూ నిరాశే: ఎమ్మెల్యేలు
Published Thu, Mar 12 2015 3:20 PM | Last Updated on Fri, Jul 12 2019 6:01 PM
Advertisement
Advertisement