‘జగన్‌ సీఎం కావాలి.. వైఎస్‌ పాలన రావాలి’ | YSRCP Plenary in Tirupati | Sakshi
Sakshi News home page

‘జగన్‌ సీఎం కావాలి.. వైఎస్‌ పాలన రావాలి’

Published Tue, May 30 2017 11:49 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM

‘జగన్‌ సీఎం కావాలి.. వైఎస్‌ పాలన రావాలి’ - Sakshi

‘జగన్‌ సీఎం కావాలి.. వైఎస్‌ పాలన రావాలి’

తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ వైఎస్‌ పాలన కావాలంటే వైఎస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరూ శక్తివంచన లేకుండా కృషిచేయాలని కోరారు. మంగళవారం ఇక్కడ ప్రారంభమైన తిరుపతి నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ ప్లీనరీలో ఆయన మాట్లాడారు. అబద్ధపు వాగ్దానాలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారని, నెరవేర్చని హామీలు ఇచ్చి ఉంటే జగన్‌ సీఎం అయి ఉండేవారని అన్నారు. చంద్రబాబు, లోకేష్‌లు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు.

ప్లీనరీకి పరిశీలకులుగా పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులుగా వైఎస్‌ జగన్‌ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఎంపీ వరప్రసాద్‌, నారాయణస్వామి తదితర నాయకులు ప్లీనరీలో పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యాచరణ, రాబోయే అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో అవలంభించాల్సిన వ్యూహాలపై ప్లీనరీలో చర్చిస్తున్నారు. పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, ప్రతినిధులు ప్లీనరీకి హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement