రణస్థలం: శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం బంటుపల్లిలో రెండు వర్గాలు దాడులు చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వైఎస్సార్ సీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ తలెత్తడంతో రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో 11 మందికి గాయాలయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.