అధికారంలో ఉన్నామనే అహంకారంతో టీడీపీ కార్యకర్తలు మరోసారి రెచ్చిపోయారు.
శ్రీకాకుళం: అధికారంలో ఉన్నామనే అహంకారంతో టీడీపీ కార్యకర్తలు మరోసారి రెచ్చిపోయారు. పొందూరు మండలం నందివాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడి చేశారు. ఈ ఘటనలో పొందూరు ఎంపీపీ భర్త సువ్వారి గాంధీ సహా నలుగురు వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.