ప్రజల తరఫున పోరాటాలు చేసేందుకు ఎప్పుడూ ముందుండే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో పోరుకు సిద్ధమైంది. ఈసారి కరువు,
శ్రీకాకుళం అర్బన్: ప్రజల తరఫున పోరాటాలు చేసేందుకు ఎప్పుడూ ముందుండే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో పోరుకు సిద్ధమైంది. ఈసారి కరువు, తాగునీటి సమస్యలపై ఉద్యమం చేపట్టనుంది. కరువుతో పంటలను కోల్పోరుు కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవడంలో, తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ముందుకురాని ప్రభుత్వం తీరుకు నిరసనగా జిల్లాలోని అన్ని తహసీల్దార్ కార్యాలయూల ఎదుట ఖాళీ బిందెలతో సోమవారం నిరసన ప్రదర్శన నిర్వహించేందుకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం పిలుపునిచ్చింది. జిల్లాలోని చాలా మండలాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ పరిష్కరించే దిశగా అధికారపక్ష నాయకులు, అధికారులు చర్యలు చేపట్టడం లేదు.
కరువును ఎలా ఎదుర్కొవాలనే అంశంపై జిల్లా అధికారులతో ప్రజాప్రతినిధులు ఒక్కసారి కూడా సమీక్షించిన పాపాన పోలేదు. తాగునీటి సమస్య పరిష్కారం కోసం కనీస చర్యలు తీసుకోలేదు. టీడీపీ ప్రభుత్వం ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకునేందుకు, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేందుకే ప్రాధాన్యత ఇస్తోంది తప్ప.. ప్రజాసమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదు. వీటిన్నింటికీ నిరసనగానే ప్రజల తరఫున ప్రతిపక్ష పార్టీగా వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. తహసీల్దార్ కార్యాలయాల వద్ద పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని తమ నిరసన తెలియజేయనున్నారు.