శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఫిబ్రవరి 2న నిర్వహించబోయే ‘యువభేరి’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం యువతకు, నిరుద్యోగులకు పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ యువభేరి కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్. జగన్ మోహన్‌రెడ్డి హాజరుకానున్నారన్నారు.
విభజన తర్వాత రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఎంత అవసరమో నిరుద్యోగులకు, యువ తకు జగన్ మోహన్‌రెడ్డి వివరించనున్నారని తమ్మినేని తెలిపారు. ప్రత్యేక హోదా వస్తే అన్ని రంగాల పరంగా అభివృద్ధి చెందుతామన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి మాట్లాడుతూ 13 జిల్లాల్లో యువత, విద్యార్థులు, నిరుద్యోగులను తమ పార్టీ అధినేత కలసి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నారన్నారు.
పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవినాగ్ మాట్లాడుతూ బాబు ఎన్నికల హామీలను ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదని దుయ్యబట్టారు. పార్టీ యువజన విభాగం జిల్లా అద్యక్షుడు పేరాడ తిలక్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన వలన జరిగిన అన్యాయం పూడ్చాలంటే ఒక్క ప్రత్యేకహోదాతోనే సాధ్యమన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రొక్కం సూర్యప్రకాశరావు, పార్టీ నాయకులు కోరాడ రమేష్, ఎం.వి.స్వరూప్, నవీన్‌కుమార్ అగర్వాల్ పాల్గొన్నారు.
‘యువభేరి’ పోస్టర్ ఆవిష్కరణ
ఫిబ్రవరి 2న నిర్వహించనున్న ‘యువభేరి’కి సంబంధించిన పోస్టర్‌ను గురువారం శ్రీకాకుళంలోని జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అద్యక్షురాలు రెడ్డి శాంతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఎంత అవసరమో యువతకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు పార్టీ అధినేత వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి వివరించనున్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు అంధవరపు సూరిబాబు, ఎన్ని ధనుంజయ్, చల్లా రవికుమార్,ధర్మాన రాంమనోహర్‌నాయుడు, పేరాడ తిలక్ తదితరులు పాల్గొన్నారు.
యువభేరికి తరలిరండి
రాజాం: శ్రీకాకుళంలో ఫిబ్రవరి 2న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న యువభేరి కార్యక్రమాన్ని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు విశేషంగా పాల్గొని విజయవంతం చేయాలని ఆ పార్టీ ఎంఎల్‌ఎ కంబాల జోగులు, రాష్ట్ర కార్యదర్శి పాలవలస విక్రాంత్ పిలుపునిచ్చారు. గురువారం స్థానిక ఎంఎల్‌ఏ నివాసగృహంలో నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువభేరిలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటారని తెలిపారు. యువభేరి విజయవంతం చేసందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. విజయనగరం జిల్లా నాయకులు మజ్జి శ్రీనివాసరావు(చిన్నశ్రీను), ఉత్తరావిల్లి సురేష్ ముఖర్జీ, కరణం సుదర్శనరావు, లావేటి రాజగోపాలనాయుడు, సిరిపురపు జగన్మోహనరావు, ఉదయాన మురళీకృష్ణ, వాకముళ్ల చిన్నారావు, శాసపు కేశవరావునాయుడు, పారంకోటి సుధ, గురుగుబిల్లి స్వామినాయుడు తదితరులు పాల్గొన్నారు.
యువభేరి మోగిద్దాం
Published Thu, Jan 28 2016 11:25 PM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement