Sitaram tammineni
-
చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు: జోగి రమేష్
సాక్షి, తాడేపల్లి: స్పీకర్ గౌరవ మర్యాదలను టీడీపీ నేతలు మంట గలుపుతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ మండిపడ్డారు. తాడేపల్లిలో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేతలు స్పీకర్ వ్యవస్థను కించపరిచేలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. బలహీన వర్గాలంటే చంద్రబాబు, లోకేష్‌కు ఎందుకంత చులకన అని ప్రశ్నించారు. బీసీ వ్యక్తి స్పీకర్ స్థానంలో ఉంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు ఓర్వలేక పోతున్నారని నిప్పులు చెరిగారు. టీడీపీ వెబ్సైట్ ఈ-పేపర్లో స్పీకర్‌ను కించపరుస్తూ వాడిన భాష సభ్య సమాజం తల దించుకొనేలా ఉందని జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, లోకేష్ స్పీకర్ కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పాలని..చెప్పకపోతే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. స్పీకర్ వ్యవస్థను కించపరిచిన విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. స్పీకర్‌పై ఎందుకు వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారో అచ్చెన్నాయుడు, కూన రవికుమార్ సమాధానం చెప్పాలని జోగి రమేష్ డిమాండ్ చేశారు. సభాపతి తమ్మినేని సీతారాం అసెంబ్లీని హుందాగా నడుపుతున్నారని జోగి రమేష్ తెలిపారు. -
ఆంధ్రుల ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు
చంద్రబాబుపై మండిపడ్డ వైఎస్సార్సీపీ నేత తమ్మినేని సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ ఆశయాలకు విరుద్ధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టడం దురదృష్టకరమని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం మండిపడ్డారు. విభజన చట్టాన్ని అనుసరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన వాటిని ముఖ్యమంత్రి ఎందుకు అడగలేక పోతున్నారని, తన స్వార్థం కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను ఎందుకు తాకట్టు పెడుతున్నారని ఆయన ప్రశ్నించారు. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓటుకు నోటు వ్యవహారంలో ఆడియో సహితంగా దొరికి పోయిన చంద్రబాబు ఆ కేసు నుంచి బయట పడటానికే రాష్ట్రం ప్రయోజనాల గురించి గట్టిగా అడగలేక పోతున్నారని సీతారాం వివరించారు. రాష్ట్రానికి కావాల్సినవి సాధించుకోవడానికి చంద్రబాబు కేంద్రంపై పోరాడలేక పోతున్నారు కాబట్టి ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్సీపీ, వామపక్షాలు, బీజేపీని కలుపుకొని అఖిలపక్షం ఏర్పాటు చేయాలని, తద్వారా కేంద్రంపై ఒత్తిడి తీసుకువద్దామని సూచించారు. శ్వేతపత్రం ప్రకటించండి ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి వెళ్లి ఏం సాధించారని బాబును తమ్మినేని ప్రశ్నించారు. ఢిల్లీకి ఎన్నిసార్లు వెళ్లారో, ఎన్ని నిధులు సాధించారో ఓ శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రానికి రూ. 2,000 కోట్లు విడుదల చేస్తూ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నిర్ణయం తీసుకుంటే.. ప్రధాని కార్యాలయం జోక్యం చేసుకుని రూ. 900 కోట్లే, అది కూడా యుటిలైజేషన్ సర్టిఫికెట్ ఇస్తేనే విడుదల చేయండి అని ఆదేశించిందంటే కేంద్రం చంద్రబాబును అసలు నమ్మడం లేదనేది స్పష్టం అవుతోందన్నారు. అసెంబ్లీలో వైఎస్ జగన్మోహన్రెడ్డిని తూలనాడే అచ్చెన్నాయుడు ఉత్తరాంధ్ర నుంచి టీడీపీలో చేరిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ చేత రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని, అపుడు జగన్ మగత నం ఏమిటో చూపిస్తారని, తన సవాలును స్వీకరించాలని సీతారాం డిమాండ్ చేశారు. -
రాజధాని భూములపై సీబీఐ విచారణకు సిద్ధమా?
ఆమదాలవలస : చారిత్రక మలుపు కోసమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందని ఆ పార్టీ రాష్ట్ర హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం అన్నారు. శనివారం ఆమదాలవలస పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తమ్మినేని మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంటు, ఆరోగ్యశ్రీ అమలు చేసి పేదలకు ఉన్నత విద్య, కార్పొరేట్ వైద్యం చేరువ చేశారని చెప్పారు. రుణమాఫీ, ఉచిత విద్యుత్‌తో అన్నదాతను ఆదుకున్నారని గుర్తు చేశారు. తండ్రి ఆశయాన్ని నెరవేర్చేందుకు జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారని చెప్పారు. రాజధాని పేరుతో చంద్రబాబు చేస్తున్న అవినీతి వెలకట్టలేదని ఆరోపించారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే రాజధాని భూములపై సీబీఐ దర్యాప్తునకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. -
ఫిరాయింపుదార్లకు నజరానాలా..
శ్రీకాకుళం అర్బన్:దమ్ముంటే తక్షణమే రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధమవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం సవాలు విసిరారు. శ్రీకాకుళంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్ సీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ పార్టీ ఫిరాయింపులకు పాల్పడడం దురదృష్టకరమన్నారు. రాజకీయాల్లో విలువలు, నీతి నియమాల కోసం టన్నుల కొద్ది ఉపన్యాసాలు ఇచ్చే చంద్రబాబు పార్టీ ఫిరాయింపులను నిర్లజ్జగా, నిస్సిగ్గుగా ప్రోత్సహిస్తూనజరానాలు ప్రకటించడం దారుణమన్నారు. నాడు దివంగత ఎన్టీఆర్ పెట్టిన టీడీపీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయని, ప్రస్తుత చంద్రబాబు అధ్యక్షత వహిస్తున్న టీడీపీకి నీతి, నియమాలు వంటివేవీ లేవన్నారు. గడచిన శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 17మంది శాసనసభ్యులు వైఎస్సార్సీపీలోకి వస్తే అది అనైతికత కిందకు వస్తుందని భావించి వారందరితో రాజీనామా చేయించి మళ్లీ గెలిపించుకుని పార్టీలో చేర్చుకుందని గుర్తు చేశారు. ఇది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నీతి, నిబద్దత, ఆదర్శమన్నారు. జగన్మోహనరెడ్డి నాయకత్వంలో ప్రజాస్వామ్య పరిరక్షణ విలువలను కాపాడామన్నారు. వైఎస్సార్సీపీని వీడిన భూమా నాగిరెడ్డి, అఖిలప్రియ, ఆదినారాయణరెడ్డి, జలీల్ఖాన్లతోపాటు ఎమ్మెల్సీ నారాయణరెడ్డిలకు ఏమాత్రం నైతికత ఉన్నా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గ ప్రజానీకానికి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఒక పార్టీ బి-ఫారం ఇచ్చి గెలిపిస్తే ఆ పార్టీకి, పార్టీ అద్యక్షునికి సమాధానం చెప్పాల్సిన నైతిక బాధ్యత ఉందన్నారు. టీడీపీ మునిగిపోయే నావ అని, వీళ్ళంతా ఎలా వెళ్ళారో అర్ధం కావడం లేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పద్ధతి ఉంటే టీడీపీ వాళ్ళతో రాజీనామా చేయించాలన్నారు. సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా అదికార ప్రతినిధి ఎన్ని ధనుంజయ్, పార్టీ నేతలు పొన్నాడ రుషి, కె.ఎల్.ప్రసాద్, శిమ్మ వెంకట్రావు, రావాడ జోగినాయుడు తదితరులు పాల్గొన్నారు. -
యువభేరి మోగిద్దాం
శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఫిబ్రవరి 2న నిర్వహించబోయే ‘యువభేరి’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం యువతకు, నిరుద్యోగులకు పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ యువభేరి కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్. జగన్ మోహన్‌రెడ్డి హాజరుకానున్నారన్నారు. విభజన తర్వాత రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఎంత అవసరమో నిరుద్యోగులకు, యువ తకు జగన్ మోహన్‌రెడ్డి వివరించనున్నారని తమ్మినేని తెలిపారు. ప్రత్యేక హోదా వస్తే అన్ని రంగాల పరంగా అభివృద్ధి చెందుతామన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి మాట్లాడుతూ 13 జిల్లాల్లో యువత, విద్యార్థులు, నిరుద్యోగులను తమ పార్టీ అధినేత కలసి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నారన్నారు. పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవినాగ్ మాట్లాడుతూ బాబు ఎన్నికల హామీలను ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదని దుయ్యబట్టారు. పార్టీ యువజన విభాగం జిల్లా అద్యక్షుడు పేరాడ తిలక్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన వలన జరిగిన అన్యాయం పూడ్చాలంటే ఒక్క ప్రత్యేకహోదాతోనే సాధ్యమన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రొక్కం సూర్యప్రకాశరావు, పార్టీ నాయకులు కోరాడ రమేష్, ఎం.వి.స్వరూప్, నవీన్‌కుమార్ అగర్వాల్ పాల్గొన్నారు. ‘యువభేరి’ పోస్టర్ ఆవిష్కరణ ఫిబ్రవరి 2న నిర్వహించనున్న ‘యువభేరి’కి సంబంధించిన పోస్టర్‌ను గురువారం శ్రీకాకుళంలోని జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అద్యక్షురాలు రెడ్డి శాంతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఎంత అవసరమో యువతకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్రెడ్డి వివరించనున్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు అంధవరపు సూరిబాబు, ఎన్ని ధనుంజయ్, చల్లా రవికుమార్,ధర్మాన రాంమనోహర్‌నాయుడు, పేరాడ తిలక్ తదితరులు పాల్గొన్నారు. యువభేరికి తరలిరండి రాజాం: శ్రీకాకుళంలో ఫిబ్రవరి 2న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న యువభేరి కార్యక్రమాన్ని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు విశేషంగా పాల్గొని విజయవంతం చేయాలని ఆ పార్టీ ఎంఎల్ఎ కంబాల జోగులు, రాష్ట్ర కార్యదర్శి పాలవలస విక్రాంత్ పిలుపునిచ్చారు. గురువారం స్థానిక ఎంఎల్ఏ నివాసగృహంలో నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువభేరిలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొంటారని తెలిపారు. యువభేరి విజయవంతం చేసందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. విజయనగరం జిల్లా నాయకులు మజ్జి శ్రీనివాసరావు(చిన్నశ్రీను), ఉత్తరావిల్లి సురేష్ ముఖర్జీ, కరణం సుదర్శనరావు, లావేటి రాజగోపాలనాయుడు, సిరిపురపు జగన్మోహనరావు, ఉదయాన మురళీకృష్ణ, వాకముళ్ల చిన్నారావు, శాసపు కేశవరావునాయుడు, పారంకోటి సుధ, గురుగుబిల్లి స్వామినాయుడు తదితరులు పాల్గొన్నారు. -
అసైన్డ్ భూములను లాక్కొనే కుట్ర
దొరికింది దొరికినట్లు సీఎం భోంచేస్తున్నారు: తమ్మినేని ధ్వజం సాక్షి, హైదరాబాద్: దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాలకు చెందిన అసైన్డ్ భూములను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లాక్కోవాలని చూస్తున్నారని వైఎస్సార్సీపీ ధ్వజమెత్తింది. ఈ వర్గాలకు భద్రత కల్పించడం కోసం ఇచ్చిన అసైన్డ్ భూములను ఇత రులు తీసుకోవడానికి ప్రతిబంధకంగా ఉన్న 9/77 చట్టాన్ని సవరించేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని మండిపడింది. పార్టీ అధికార ప్రతి నిధి తమ్మినేని సీతారాం శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అసైన్డ్ భూములను తన పచ్చదండుకు కట్టబెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. బలహీనవర్గాల ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకు ని వారి నుంచి పెత్తందార్లు కొనుగోలు చేసిన భూములను 500 నుంచి వెయ్యి గజాల మేరకు స్లాబులుగా విభజించి క్రమబద్ధీకరించేందుకు తెర లేపుతున్నారన్నారు. వందిమాగధులకు కట్టబెడతారా? : ల్యాండ్ బ్యాంక్ పేరుతో తడ నుంచి ఇచ్ఛాపురం వరకూ పది లక్షల ఎకరాల భూమిని చంద్రబాబు సేకరిస్తున్నారని, ఇవన్నీ తన వందిమాగధులకే కట్టబెట్టాలని చూస్తున్నారన్నారు. ఎలాగూ మళ్లీ అధికారంలోకి వచ్చేది లేదు కాబట్టి ఇల్లుండగానే దీపం చక్క బెట్టుకోవాలని ఇలా చేస్తున్నారా? అని సీతారాం అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబునాయుడు ‘ఈట్ ఇండియా కంపెనీ’కి సీఈఓగా వ్యవహరిస్తూ దొరికింది దొరికినట్లుగా భోంచేస్తున్నారని తమ్మినేని ఎద్దేవా చేశారు. టీడీపీ మేనిఫెస్టోలో హామీలేవీ నెరవేర్చలేదని, దీనిపై ప్రజల సమక్షంలో ఉమ్మడి వేదికపై తనతో చర్చకు రావాలని సీతారాం సవాలు విసిరారు. -
రాష్ర్టంలో చంద్రబాబు కుట్రపాలన
ఎచ్చెర్ల :రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడి కుట్రపూరిత పాలన సాగుతోందని, దీనిపై ప్రజలను చైతన్య పరిచి తిప్పికొట్టేలా చూడాల్సిన అవసరం ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పవర్ కమిటీ సభ్యుడు, మాజీ మంత్రి తమ్మినేని సీతారాం కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మండలంలోని తోటపాలెం కూడలి సమీపంలోని తన్మయి ఫంక్షన్హాల్లో శనివారం నిర్వహించిన మండల విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బాబు కుట్రపాలనను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రైతులు, డ్వాకా సం ఘాల రుణ మాఫీతో అధికారంలోకి వచ్చిన బాబు హామీని నిలబెట్టుకోలేదన్నారు. ఇంటికో ఉద్యోగం తదితర హామీలను గాలికొదిలేశారని ఆరోపించారు. విదేశాలు తిరిగేందుకే బాబుకు సమయం చాలటం లేదని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షంలో ఉండగా అణువిద్యుత్ ప్రాజెక్టులకు వ్యతిరేకం అని చెప్పిన టీడీపీ ప్రస్తుతం చాప కింద నీరులా ప్రాజెక్టులకు అనుమతులు ఇస్తోందన్నారు. బాబు తన హామీలను నిలబెట్టుకునేవరకూ పార్టీ తరఫున పోరాడుతామని హెచ్చరించారు. పార్టీలకు అతీతంగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజలకు అప్పట్లో పథకాలు అందిస్తే ప్రస్తుత రాజకీయ జోక్యానికి పథకాల అమల్లో ప్రాధాన్యం ఇస్తోందని సీతారాం ఆరోపించారు. అలాగే వైఎస్సార్ సీపీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు చెప్పారు. వచ్చేనెల ఐదో తేదీన పార్టీ చేపట్టే మహాధర్నా విజయవంతానికి కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి మాట్లాడుతూ జిల్లాలో అర్హులైన 28 వేల మంది పింఛన్లను ప్రభుత్వం అక్రమంగా తొలగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న 2019 ఎన్నిక ల్లో టీడీపీ కొట్టుకుపోవటం ఖాయమని అన్నారు. హుద్‌హుద్ తుపాను బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే మీసాల నీలకంఠంనాయుడు, పార్టీ ఎచ్చెర్ల నియోజకవర్గ సమన్వయ రక్త గొర్లె కిరణ్‌కుమార్, మాజీ ఎంపీపీ జనార్దనరెడ్డి, జెడ్పీ మాజీ విప్ సనపల నారాయణరావు, పార్టీ అధ్యక్షు డు మాడుగుల మురళీధర్ బాబా తదితరులు మాట్లాడుతూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ధ్వజమెత్తారు. పార్టీ అభివృద్ధికి పాటు పడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు నక్కా కృష్ణమూర్తి, జురుగుళ్ల శంకరరావు, నేతింటి నీలమప్పడు, జీరు అయ్యప్ప రెడ్డి, అంబటి శ్రీనివాసరావు, సనపల సూరిబాబు, పైడి భాస్కరరావు, పైడి త్రిమూర్తులు, కళ్లేపల్లి తిరుపతి రావు, బాడాన జనార్దన, అంబటి సుజాత, సనపల ఇందిర, బాషా శ్రీనివాసరావు, డొంక పోలయ్య, డొంక అప్పలరాజు, సువ్వారి రవికుమార్, నూక పాపారావు తదితరులు పాల్గొన్నారు. -
మాటలతో మాయ చేస్తున్నారు
టీడీపీ పాలనపై వైఎస్సార్సీపీ నేత తమ్మినేని ధ్వజం హైదరాబాద్: చంద్రబాబు వంద రోజుల పాలనలో పురోగతిపై శ్వేతపత్రం విడుదల చే యాలని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం డిమాండ్ చేశారు. ఈ వంద రోజు ల్లో టీడీపీ ప్రభుత్వం చేసింది శూన్యమని పే ర్కొంటూ.. తాము ఫలానా పని చేశామని అధికారపక్షం చెప్పగలదా? దీనిపై బహిరంగ చర్చకు వస్తారా? అని ఆయన సవాలు విసిరారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో తమ్మినేని విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల హామీలపై మాటలు చెబుతూ కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు. నవ్యాంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్ అని చంద్రబాబు చెబుతుంటే ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు మాత్రం మరోవైపు మద్యాంధ్రప్రదేశ్ అంటున్నారని విమర్శించారు. బెల్ట్‌షాపుల రద్దుపై చంద్రబాబు రెండో సంతకం చేస్తే.. యనమల మాత్రం సెప్టెంబర్ నెలాఖరు కు నిర్దేశించిన లక్ష్యం ప్రకారం ‘వ్యాట్’ వసూళ్లు రావాల్సిందేనని అధికారులకు హుకుం జారీ చేశారని ఆయన తెలిపారు. సెప్టెంబర్ ముగిసేనాటికి రూ.2,314.20 కోట్ల మేరకు రావాల్సిన వసూళ్లు రూ.1,805.13 కోట్లకే ఎందుకు పరిమితమయ్యాయని యనమల ప్రశ్నిస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదాయం తగ్గడానికి వీల్లేదని మంత్రి తాఖీ దులిచ్చారని అన్నారు. మద్యం నుంచి వచ్చే ఆదాయమే ఖజానాకు శరణ్యమని మంత్రి చెప్ప డం ప్రజలను ఫుల్లుగా తాగండని సందేశమివ్వడమేనన్నారు. బాబు గతంలో తొమ్మిదేళ్ల పాలనలో ఇలాగే ఖజానా నింపుకునేందుకు ప్రయత్నించా రన్నారు. 2003 జనవరిలోనే 40 వేలకుపైగా బెల్ట్‌షాపులుండేవి. ఇపుడు మళ్లీ అలాగే ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, అటవీ, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖల ఆదాయాన్ని సమీక్షిస్తూ పెంచుకునే యత్నం చేస్తున్నారన్నారు. రైతుల రుణమాఫీ గురించి ఎన్నికల్లో చెప్పిందొకటి, ఇపుడు చేస్తున్నది మరొకటని, ఆర్బీఐ గురించిగానీ, కోట య్య కమిటీ వేస్తామనిగానీ అపుడు చెప్పలేదని అన్నారు. రుణమాఫీ కోసం సుజనా చౌదరి ఆధ్వర్యంలో ఓ సంస్థను ఏర్పాటు చే యడమెందుకు? రుణాలన్నీ కట్టేయమని చంద్రబాబు ఒక్కమాట చెబితే చాలు ఆయనే చెల్లిస్తారని సలహాఇచ్చారు. -
రాజధాని పేరిట టీడీపీ భూదందాలు: వైఎస్సార్సీపీ
హైదరాబాద్: విజయవాడ, గుంటూరులో రాజధాని నిర్మిస్తానని ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ మాఫియాను ప్రోత్సహిస్తున్నారని వైఎస్సార్సీపీ విమర్శించింది. రాజధాని నిర్మాణం పేరుతో విజయవాడ, గుంటూరు పరిసరాల్లో జరుగుతున్న భూమి లావాదేవీలపై శాసనసభా సంఘంతో గాని, సిటింగ్ న్యాయమూర్తితో గాని విచారణకు ఆదేశించాలని పార్టీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం డిమాండ్ చేశారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. -
‘ది.. వాకర్’ నీ విశ్వసనీయత ఏమిటి?
జేసీ వ్యాఖ్యలు అహంకారపూరితం: తమ్మినేని ధ్వజం హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మూతపడుతుందంటూ అధికార టీడీపీ ఎంపీ జె.సి.దివాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన అహంకారపూరిత వైఖరికి నిదర్శనమని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం మండిపడ్డారు. ఆయన సోమవారం పార్టీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ.. జేసీ చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారని, అసలాయనకున్న విశ్వసనీయత ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ నుంచి బయటపడిన దివాకర్ ఏ పార్టీలో చేరాలో తెలియక అన్ని పార్టీల చుట్టూ పాదయాత్ర చేసి ‘ది.. వాకర్’ (నడిచేవాడు)గా తన పేరును సార్థకం చేసుకున్నారని ఎద్దేవా చేశారు. ‘‘టీడీపీని జేసీ క్లోజ్ చేస్తారో.. టీడీపీయే ఆయనను క్లోజ్ చేస్తుందో ముందుగా తేల్చుకోవాలి’’ అని సూచించారు. సూర్యచంద్రులున్నంత వరకూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ వైఎస్సార్ సీపీ అజరామరంగా ఉంటుంద.. ప్రజల హృదయాల్లో తమ పార్టీ ఎప్పటికీ సుస్థిరంగా ఉంటుందని పేర్కొన్నారు. పోలవరానికి అన్ని అనుమతులు తెచ్చిందీ వైఎస్ అని తెలియదా? పోలవరం ప్రాజెక్టు గురించి కూడా దివాకర్ అర్థరహితంగా మాట్లాడుతున్నారని తమ్మినేని తప్పుపట్టారు. పోలవరం ప్రాజెక్టుకు రూపకల్పన చేసిందీ, దానికి అన్ని రకాల అనుమతులు సాధించింది, పోలవరం నిర్మాణం పూర్తికావాలని తుదిశ్వాస వరకూ తపించిందీ వై.ఎస్.రాజశేఖరరెడ్డి అనే విషయం నిన్నటి వరకూ కాంగ్రెస్‌లో ఉన్న జేసీకి తెలియదా అని ఆయన ప్రశ్నించారు. ‘‘పోలవరం నిర్మాణం చేపట్టాలని తమ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మూడు రోజుల పాటు పాదయాత్ర చేసిన విషయం దివాకర్‌కు తెలియదా? పోలవరం నిర్మాణం కోసం ఏళ్ల తరబడి వైఎస్ కృషి చేస్తున్న సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఒక్క దరఖాస్తు అయినా తాను స్వయంగా పంపారా?’’ అని తమ్మినేని సూటిగా ప్రశ్నించారు. పోలవరంపై తమ పార్టీ వైఖరిలో ఏమీ మార్పు లేదని, దాని నిర్మాణం సత్వరం జరగాలని, తద్వారా ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నామని ఆయన స్పష్టంచేశారు.