సార్‌.. లీవు కావాలి..! | ZP Chairman Rejects DEO Leave Letter Anantapur | Sakshi
Sakshi News home page

సార్‌.. లీవు కావాలి..!

Published Fri, Jun 1 2018 7:14 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM

ZP Chairman Rejects DEO Leave Letter Anantapur - Sakshi

జెడ్పీ చైర్మన్‌ నాగరాజును సెలవు అడుగుతున్న డీఈఓ

అనంతపురం సిటీ: మరికొద్ది నిమిషాల్లో జెడ్పీ స్థాయీ సంఘ సమావేశం జరగనుండగా... జిల్లా విద్యాశాఖాధికారి జనార్దనాచార్యులు జెడ్పీ చైర్మన్‌ నాగరాజు చాంబర్‌కు వచ్చారు.. తనకు లీవు కావాలని కోరారు. ఈ మాట చెప్పేందుకే ఇంత దూరం వచ్చానన్నారు. అయితే చైర్మన్‌ నాగరాజు మాత్రం కుదరదని తేల్చిచెప్పారు. ‘‘ఇప్పుడే రిజర్వేషన్ల పరిరక్షణ సమితి వారు నాముందే మీకు వినతి పత్రం ఇచ్చి సమస్యలు ఏకరువు పెట్టారు.. ఇక సమావేశంలో సభ్యులు ఎన్ని సమస్యలు లేవనెత్తుతారో..? వాటన్నింటికీ సమాధానం చెప్పేది ఎవరన్నారు.

అందువల్ల సెలవు ఇవ్వడం కుదరదన్నారు. జెడ్పీలో జరిగే సమావే?శాలకు చాలా మంది జిల్లా అధికారులు గైర్హాజరవుతుండగా.. ప్రతి శాఖ అధికారీ హాజరయ్యేలా చూడాలని తానే కలెక్టర్‌ను కోరానన్నారు. అయినా ఏదైనా వ్యక్తిగత ఇబ్బంది ఉంటే రెండు రోజుల ముందుగానే అనుమతి తీసుకోవాలని..ఇలా ఇపుడొచ్చి సెలవు అడగడం సరికాదన్నారు. దీంతో డీఈఓ తన ప్రయత్నాన్ని విరమించుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement