
శ్రీ వికారి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ మాసం, తిథి బ.అష్టమి రా.8.25 వరకు, తదుపరి నవమి, నక్షత్రం విశాఖ ఉ.10.27 వరకు, తదుపరి అనూరాధ
వర్జ్యం ప.2.18 నుంచి 3.20 వరకు దుర్ముహూర్తం సా.4.25 నుంచి 5.11 వరకు, అమృతఘడియలు... రా.11.29 నుంచి 1.02 వరకు.
సూర్యోదయం : 6.31
సూర్యాస్తమయం : 5.58
రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు
భవిష్యం
మేషం: కొత్తగా రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు.
వృషభం: కొత్త విషయాలు తెలుస్తాయి. విద్యార్థులకు అనూహ్య ఫలితాలు. సంఘంలో గౌరవం. వస్తు,వస్త్రలాభాలు. కొన్ని వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.
మిథునం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.
కర్కాటకం: ఆస్తి తగాదాలు పరిష్కారం. శుభవార్తా శ్రవణం. విందువినోదాలు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది.
సింహం: రుణదాతల ఒత్తిడులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువులతో మాటపట్టింపులు. స్వల్ప అనారోగ్యం. కుటుంబసభ్యులతో చర్చలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.
కన్య: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆస్తిలాభ సూచనలు. బ«ంధువులతో సఖ్యత. విందువినోదాలు. చిన్ననాటి విషయాలు తెలుసుకుంటారు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.
తుల: శ్రమకు ఫలితం కనిపించదు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి.
వృశ్చికం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వాహనయోగం. భూవివాదాల పరిష్కారం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.
ధనుస్సు: కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. బంధువిరోధాలు. సోదరులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
మకరం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వాహనసౌఖ్యం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.
కుంభం: సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా కొనసాగుతారు.
మీనం: వ్యవహారాలు మందగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు ఎదురవుతాయి.
– సింహంభట్ల సుబ్బారావు
Comments
Please login to add a commentAdd a comment