న్యూఢిల్లీ: గతేడాదిలో మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు జోరుమీద కొనసాగాయి. ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంపొందించడం కోసం మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ తీసుకున్న చర్యల నేపథ్యంలో భారీ స్థాయి పెట్టుబడులను ఆకర్షించాయి. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా(యాంఫీ) విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం.. మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) గతేడాదిలో రూ. 3.15 లక్షల కోట్లు (13 శాతం వృద్ధి) పెరిగాయి. దీంతో అంతక్రితం ఏడాది (2018)లో రూ. 23.62 లక్షల కోట్లుగా ఉన్న మొత్తం పరిశ్రమ నిర్వహణ ఆస్తి.. గత నెల చివరినాటికి రూ. 26.77 లక్షల కోట్లకు చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment