2025కల్లా రూ.94 లక్షల కోట్లకు మ్యూచువల్‌ ఫండ్స్‌ ఆస్తులు | 3 Top-Ranked Columbia Mutual Funds Promising Great Returns | Sakshi
Sakshi News home page

2025కల్లా రూ.94 లక్షల కోట్లకు మ్యూచువల్‌ ఫండ్స్‌ ఆస్తులు

Published Fri, Jun 30 2017 1:06 AM | Last Updated on Tue, Sep 5 2017 2:46 PM

2025కల్లా రూ.94 లక్షల కోట్లకు మ్యూచువల్‌ ఫండ్స్‌ ఆస్తులు

2025కల్లా రూ.94 లక్షల కోట్లకు మ్యూచువల్‌ ఫండ్స్‌ ఆస్తులు

ముంబై: ప్రస్తుతం రూ. 20 లక్షల కోట్ల మేర వున్న మ్యూచువల్‌ ఫండ్‌ ఆస్తులు 2025 సంవత్సరానికల్లా ఐదు రెట్లు పెరిగి, రూ.94 లక్షల కోట్లకు చేరుకుంటాయని మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమకు చెందిన అసోసియేషన్‌ యాంఫి అంచనావేసింది. ఈ వృద్ధి సాధించేందుకు ఫండ్స్‌ యూనిట్లను విక్రయించే డిస్ట్రిబ్యూటర్ల సంఖ్యను ప్రస్తుత 86,000 నుంచి 6 లక్షలకు పెంచుకోవాల్సివుంటుందని యాంఫి ఛైర్మన్‌ ఏ. బాలసుబ్రమణియన్‌ చెప్పారు.

మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణలో వున్న ఆస్తుల విలువ కొద్దిరోజుల క్రితమే రూ. 20 లక్షల కోట్లకు చేరింది. వచ్చే ఎనిమిదేళ్లలో 23 శాతం చొప్పున వార్షిక వృద్ధితో రూ. 94 లక్షల కోట్లకు చేరుతుందని అంచనావేస్తున్నట్లు బాలసుబ్రమణియన్‌ చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement