ఏడాదిలో 300 ఫ్లాట్ల అప్పగింత!
• 5 లక్షల చ.అ.ల్లో వాణిజ్య స్థలం కూడా..
• శరవేగంగా ముస్తాబవుతున్న శాంతా శ్రీరామ్ ప్రాజెక్ట్‌లు: ఎండీ నర్సయ్య
సాక్షి, హైదరాబాద్: గడువులోగా కొనుగోలుదారులకు ఇంటి తాళాలందించడమే తమ లక్ష్యమంటోంది శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్. ప్రతికూల పరిస్థితుల్లోనూ నిర్మాణ పనులను ఆపలేదని.. శరవేగంగా ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తున్నామని సంస్థ ఎండీ నర్సయ్య ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. రానున్న ఏడాది కాలంలో 300 ఫ్లాట్ల నిర్మాణ పనులు పూర్తి చేసి, కొనుగోలుదారులకు అందిస్తామని పేర్కొన్నారు. ఏడాది క్రితం నగరంలో ప్రారంభించిన నివాస, వాణిజ్య సముదాయాల పనుల పురోగతిని వివరించారు.
⇔ యూసుఫ్‌గూడలో 6 వేల గజాల్లో బ్లూ బర్డ్స్ హ్యాబిటేట్ లగ్జరీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. ఇందులో 65 ఫ్లాట్లొస్తాయి. 1,800-2,200 చ.అ.ల్లో అన్నీ 3 బీహెచ్‌కే ఫ్లాట్లే. ధర చ.అ.కు రూ.6 వేలు. 80 శాతం స్ట్రక్చర్ పనులు, 40 శాతం బ్రిక్ వర్క్ పూర్తయ్యింది. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తాం.
⇔ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 13లో 5,500 గజాల్లో డ్యూక్స్ గెలాక్సీని నిర్మిస్తున్నాం. 1,800-2,300 చ.అ.ల్లో ఫ్లాట్లు, స్టూడియో అపార్ట్‌మెంట్లుంటాయి. ధర చ.అ.కు రూ.8 వేలు. స్ట్రక్చర్ పనులు పూర్తయ్యాయి. బ్రిక్ వర్క్ నడుస్తోంది. ఇది కూడా వచ్చే డిసెంబర్ నాటికి పూర్తి చేస్తాం.
⇔ మణికొండలో 6 ఎకరాల్లో స్ప్రింగ్ వ్యాలీ విల్లా ప్రాజెక్ట్‌ను చేస్తున్నాం. జీ+2 ఫ్లోర్లలో మొత్తం 40 ఇండిపెండెట్ విల్లాలుంటాయి. ఇప్పటికే 30 విల్లాల స్ట్రక్చర్, బ్రిక్ పనులు పూర్తయ్యాయి. ధర చ.అ.కు రూ.10 వేలు. 50 శాతం అమ్మకాలు పూర్తయ్యాయి. 9 నెలల్లో కొనుగోలుదారులకు అందిస్తాం.
⇔ ముషీరాబాద్‌లో 5,500 గజాల్లో చాలెట్ మిడోస్ ప్రాజెక్ట్‌ను చేస్తున్నాం. మొత్తం 90 ఫ్లాట్లు. 1,100-1,600 చ.అ.ల్లో 2, 3 బీహెచ్‌కే ఫ్లాట్లుంటాయి. ధర చ.అ.కు రూ.5 వేలు. స్ట్రక్చర్ పనులు జరుగుతున్నాయి. ఏడాదిన్నరలో ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తాం.
⇔ అమీర్‌పేటలో 70 ఫ్లాట్ల ప్రాజెక్ట్‌ను చేస్తున్నాం. 1,245- 1,500 చ.అ. మధ్య 2,3 బీహెచ్‌కే ఫ్లాట్లుంటాయి. ధర చ.అ.కు రూ.6 వేలు.
⇔ కిస్మత్‌పూర్‌లో 6 ఎకరాల్లో విల్లా ప్రాజెక్ట్‌ను చేస్తున్నాం. మొత్తం 60 విల్లాలొస్తాయి. నిర్మాణ పనులు ప్రారంభించాం.
⇔ రెండు నెలల్లో అప్పా జంక్షన్, బహుదూర్‌పల్లిలో ప్రాజెక్ట్‌లు ప్రారంభించనున్నాం. అప్పాలో ఎకరన్నర విస్తీర్ణంలో 900 ఫ్లాట్ల ప్రాజెక్ట్ రానుంది. బహుదూర్‌పల్లిలో 22 ఎకరాల్లో 200 విల్లాలు, 300 ఫ్లాట్ల ప్రాజెక్ట్ ప్రారంభించనున్నాం.
5 లక్షల చ.అ.ల్లో కమర్షియల్ స్పేస్
నగరంలో పలు కమర్షియల్ ప్రాజెక్ట్‌ల నిర్మాణ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది కాలంలో 5 లక్షల చ.అ. వాణిజ్య స్థలం నిర్మాణ పనులను పూర్తి చేయాలని నిర్ణయించాం. జూబ్లిహిల్స్ రోడ్ నంబర్ 36లో 71 వేల చ.అ. ఎన్‌బీఆర్ కమర్షియల్ ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఇందులో 1,500 నుంచి 10 వేల చ.అ.ల్లో షాపింగ్ కాంప్లెక్స్, కార్యాలయాల స్థలాన్ని అభివృద్ధి చేస్తున్నాం. ప్యాట్నీ సెంటర్‌లో 9 లక్షల చ.అ.ల్లో ప్యాట్నీ మాల్, బేగంపేటలో 50 వేల చ.అ.ల్లో బ్లూ మూన్, ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో 2.84 లక్షల చ.అ.ల్లో ఓడియన్ మాల్స్ నిర్మాణ పనులు పూర్తి చేస్తాం.