ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో 4జీ సర్వీసులు | 4G services in Hyderabad | Sakshi
Sakshi News home page

ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో 4జీ సర్వీసులు

Published Fri, Jan 2 2015 12:47 AM | Last Updated on Sat, Sep 2 2017 7:04 PM

ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో 4జీ సర్వీసులు

ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో 4జీ సర్వీసులు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం రంగ సంస్థ ఎయిర్‌టెల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లో 4జీ సర్వీసులను ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. ఫిబ్రవరిలోగా సర్వీసులను మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కంపెనీ బెంగళూరు, కోల్‌కతా, పుణే, చండీగఢ్, అమృత్‌సర్, నాగ్‌పూర్, నాసిక్ తదితర 16 నగరాల్లో 4జీని అందిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే 4జీని పరిచయం చేయడం ఖాయమని ఎయిర్‌టెల్ ఉన్నతాధికారి సాక్షి బిజినెస్ బ్యూరోకు చెప్పారు.

సర్కిల్‌లో తొలుత హైదరాబాద్‌లో ప్రారంభిస్తామని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైజాగ్, విజయవాడ నగరాలకు కూడా ఈ సర్వీసులు విస్తరించే అవకాశాలున్నాయి. 3జీ ధరకే 4జీ సేవలు అందిస్తున్నట్టు కంపెనీ చెబుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లో ఎయిర్‌టెల్‌కు 2.08 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. మరోవైపు షియోమి రెడ్‌మి నోట్ 4జీ మొబైల్‌ను రూ.9,999 ధరకు ఆఫర్ చేస్తున్నట్లు ఎయిర్‌టెల్ తెలిపింది. హైదరాబాద్‌తో సహా మొత్తం ఆరు నగరాల్లోని ఎయిర్‌టెల్ స్టోర్స్‌లలో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చని కంపెనీ పేర్కొంది.

లాభాల్లోనే 5 విమానాశ్రయాలు
హైదరాబాద్: ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ.. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) ప్రాతిపదికన నడుస్తున్న హైదరాబాద్ సహా అయిదు ఎయిర్‌పోర్టులు లాభాల్లోనే కొనసాగనున్నాయి. 2012-13లో దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య తగ్గినా.. ఆ తర్వాత 2013-14లోనూ, 2014-15 తొలినాళ్లలోనూ దేశీ, విదేశీ రూట్లలో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇదే ధోరణి వచ్చే ఆర్థికసంవత్సరం ప్రథమార్ధంలోనూ కొనసాగనుంది. ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఇండ్-రే) ఒక నివేదికలో ఈ విషయాలు పేర్కొంది. ప్రయాణికుల సంఖ్య పెరిగిన ఫలితంగా.. ఇతరత్రా నాన్-ఏరోనాటికల్ ఆదాయాలూ గణనీయంగా పెరుగుతున్నట్లు వివరించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement