
రెండేళ్లలో 60% వృద్ధి
♦ శరవేగంగా ముస్తాబవుతున్న ఆకృతి టౌన్‌షిప్
♦ నాగోల్, హబ్సిగూడలో కమర్షియల్ ప్రాజెక్ట్‌లూ నిర్మాణంలో..
‘‘కొనేటప్పుడు తక్కువ ధరలో రావాలి. అమ్మేటప్పుడు మాత్రం ఎక్కువ ధర కావాలి’’ స్థిరాస్తి కొనుగోలుదారులెవరిదైనా సరే ఇదే మాట. దీన్ని అక్షరాలా నిజం చేస్తోంది బోడుప్పల్‌లోని ఆకృతి టౌన్‌షిప్. సురక్ష అవెన్యూ ప్రై.లి. సంస్థ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో రెండేళ్ల క్రితం చ.అ. రూ.1,800కు కొనుగోలు చేసిన ఓ కస్టమర్.. అదే ఫ్లాట్‌ను ఇప్పుడు రూ.3,000కు విక్రయించేశాడు. అంటే 60 శాతం ధర అప్రిసియేషన్ పొందాడన్నమాట. ఇది చాలదూ ప్రాంతం అభివృద్ధి, ప్రాజెక్ట్‌లోని వసతులు, నిర్మాణ తీరుతెన్నుల గురించి చెప్పడానికి!
⇔ మెట్రో రైలు, యాదాద్రి అభివృద్ధి పనులు, పోచారంలోని ఐటీ కంపెనీలు వంటి పలు కారణాలతో ఉప్పల్–యాదాద్రి ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికే ఈ ప్రాం తంలో బ్రాండెడ్ షోరూమ్‌లు, అంతర్జాతీయ పాఠశాలలు, ఆసుపత్రులు, మల్టీప్లెక్స్‌లు, ఫుడ్ కోర్టులూ వచ్చేశాయి. ఇలాంటి ప్రాంతంలో అం దుబాటు ధరల్లో ఇళ్లను అందించాలనే లక్ష్యంతో బోడుప్పల్‌లో ఆకృతి టౌన్‌షిప్‌ను ప్రారంభిం చాం. 5 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ 8 బ్లాకుల్లో సెల్లార్+స్టిల్ట్+8 అంతస్తుల్లో ఉంటుంది.
⇔ ఇందులో మొత్తం 472 ఫ్లాట్లుంటాయి. 2 బీహెచ్‌కే 256 యూనిట్లు, 3 బీహెచ్‌కే 216 యూనిట్లుంటాయి. 1,000 నుంచి 2,300 చ.అ. మధ్య ఫ్లాట్ల విస్తీర్ణాలున్నాయి. ధర చ.అ.కు రూ.3,000. ఇప్పటికే 272 ఫ్లాట్ల నిర్మాణం పూర్తయి.. కొనుగోలుదారులకు అప్పగించేశాం. రెండేళ్ల క్రితం నుంచే నివాసముంటున్నారు కూడా.
⇔ ఆకృతి టౌన్‌షిప్‌లో 40 వేల చ.అ.ల్లో ఆధునిక వసతులన్నీ ఉంటాయి. వసతుల కోసం 8 అంతస్తుల్లో ప్రత్యేకంగా బ్లాక్‌ను కేటాయించాం. ఇందులో స్విమ్మింగ్ పూల్, మినీ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్, మెడిటేషన్ హాల్, లేడీస్ క్లబ్, గెస్ట్ రూమ్స్, సూపర్ మార్కెట్, స్పా, కెఫెటేరియా, డిస్పెన్సరీ వంటివన్నీ ఉంటాయి. వచ్చే ఏడాది ముగింపు నాటికి ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తాం.
⇔ నాగోల్‌లో 1.25 లక్షల చ.అ.ల్లో, హబ్సిగూడ స్ట్రీట్ నంబర్ 2లో 20 వేల చ.అ.ల్లో కమర్షియల్ ప్రాజెక్ట్‌లను కూడా నిర్మిస్తున్నాం. నాగోల్ ప్రాజెక్ట్‌లో 4 స్క్రీన్స్ మల్టీప్లెక్స్, మూడంతస్తుల్లో ఫుడ్ కోర్ట్స్, ఇతర బ్రాండెడ్ షోరూమ్స్ రానున్నాయి. హబ్సిగూడ ప్రాజెక్ట్‌లో మూడంతస్తుల్లో రిలయన్స్ ట్రెండ్స్ రానుంది. జీడిమెట్ల సుచిత్ర జంక్షన్‌లో 1.5 లక్షల చ.అ.ల్లో ఓ ప్రాజెక్ట్‌ను చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశాం. ఈ ఏడాదిలో ప్రారంభించేస్తాం.
శివారు డెవలపర్లను ప్రోత్సహించాలి
- సురక్ష అవెన్యూస్ ప్రై.లి. డైరెక్టర్ టి. శశికాంత్ రెడ్డి
⇔ ప్రధాన నగరంలో అయినా, శివారు ప్రాంతాల్లో అయినా నిర్మాణ వ్యయం సమానంగానే ఉంటుంది. కానీ, చ.అ. ధరలు మాత్రం ప్రధాన నగరంలో ఎక్కువగా, శివారు ప్రాంతాల్లో తక్కువగా ఉంటాయి. అందుకే శివారు ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టే డెవలపర్లను ప్రోత్సహించాలి. శివారు ప్రాంతాల్లో నిర్మాణాలతో ప్రధాన నగరంపై ఒత్తిడి తగ్గుతుంది. జనాభా, అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది. ప్రతి అవసరానికీ ప్రధాన నగరానికి వెళ్లాల్సిన అవసరముండదు. ట్రాఫిక్ తగ్గి నగరం పర్యావరణహితంగానూ ఉంటుంది.
⇔ రూ.1,000, రూ.500 నోట్ల రద్దుతో చతికిలపడ్డ స్థిరాస్తి రంగాన్ని స్థిరాస్తి నియంత్రణ అభివృద్ధి బిల్లు (రెరా), వస్తు సేవల పన్ను (జీఎ స్‌టీ)లు మరింత నీరుగార్చేలా ఉంది. రెరా పరిధి లోకి నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లను చేరిస్తే.. డెవలపర్లకే కాదు కొనుగోలుదారులకూ గందరగోళంగా ఉంటుం ది. 50–60 శాతం నిర్మాణం పూర్తయిన ప్రాజెక్ట్‌లనైనా రెరా నుంచి మినహాయింపు ఇవ్వాలి. లేకపోతే పాత ధరలతో, బిల్టప్ ఏరియా చొప్పున విక్రయించిన వాటికి రెరాలో కొత్త ధరలతో, కార్పెట్ ఏరియా చొప్పున విక్రయించడానికి మధ్య గందరగోళం నెలకొంటుంది. గతంలో కొన్న కస్టమర్ల ఫ్లాట్ల అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు కూడా పూర్తయి ఉంటాయి. ఇప్పుడు వీళ్లంతా కొత్తగా రెరాలో రాలేరు. మధ్య, ఎగువ తరగతి ఫ్లాట్లనన్నింటికీ ఒకే రకమైన జీఎస్‌టీని విధించడం సరైంది కాదు. రూ.30–40 లక్షల్లోపుండే ఫ్లాట్లకు పన్ను రేట్లను తగ్గించాలి. – సాక్షి, హైదరాబాద్