న్యూఢిల్లీ : ఆధార్ అనుసంధానం విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆధార్ అనుసంధానంతో బ్యాంకుల్లో మోసాలు ఆగవని కేంద్రంపై మండిపడింది. మోసాలను అరికట్టేందుకు ఆధార్ అనుసంధానం పరిష్కారం కాదని తెలిపింది. ఆధార్ అనుసంధానంపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
కొంతమంది బ్యాంకర్లే మోసగాళ్లతో చేతులు కలుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. మోసగాళ్లు ఎవరో బ్యాంకులకు తెలుసని పేర్కొంది. ఇటీవల ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకుల్లో చోటుచేసుకుంటున్న భారీ కుంభకోణాల నేపథ్యంలో సుప్రీం వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment