ఏబీసీడీ 2 చిత్రం విజయవంతం కావాలన్న ఆకాంక్షను ఎస్‌బీఎస్ బయోటెక్ యూనిట్ 2 ప్రముఖ బ్రాండ్ ‘రూప్ మంత్ర’ (ఆయుర్వేదిక్ ఆరోగ్య, సౌందర్యోత్పత్తులు) ప్రతినిధులు వ్యక్తంచేశారు. రిమో డిసౌజా దర్శకత్వంలో వరుణ్ ధావన్, శ్రద్ధా కపూర్ నటించిన ఈ చిత్రం జూన్ 19న విడుదలైంది. అంతకుముందు చండీగఢ్‌లో ఏబీసీడీ2-రూప్‌మంత్ర ‘మీట్-గ్రీట్’ కార్యక్రమం జరిగింది. కంపెనీ సీఎండీ సంజీవ్ జానేజా ఇతర సిబ్బంది అలాగే ఏబీసీడీ 2 చిత్ర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒక కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ, సక్రమ అభ్యాసం ద్వారా నాట్యం ఎవరైనా చేయవచ్చని చిత్ర టైటిల్ చెబుతోందని, ఇదే విధంగా రూప్ మంత్ర వినియోగంతో ప్రతి ఒక్కరూ ఆకర్షణీయులుగా మారవచ్చని తమ సందేశమని వివరించారు.
ఏబీసీడీ2-రూప్‌మంత్ర ‘మీట్-గ్రీట్’ కార్యక్రమం
Published Tue, Jun 23 2015 12:39 AM | Last Updated on Sun, Sep 3 2017 4:11 AM
Advertisement
Advertisement