స్వాన్ టెలికంలో అడాగ్ వేల కోట్ల పెట్టుబడులు: సీబీఐ వాదన
న్యూఢిల్లీ : స్పెక్ట్రం కుంభకోణం కేసుకు సంబంధించి రిలయన్స్ అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్ (అడాగ్) .. టెలికం సంస్థ స్వాన్ టెలికం (ఎస్‌టీపీఎల్)లో వేల కోట్లు నిధులు పెట్టిందని సీబీఐ ఆరోపించింది. 2007 మార్చిలో 13 సర్కిళ్లలో 2జీ లెసైన్సుల కోసం ఎస్‌టీపీఎల్ దరఖాస్తు చేసుకుందని సీబీఐ తెలిపింది. అయితే నికర విలువ నిబంధనల ప్రకారం దానికి అర్హత లేకపోవడంతో అడాగ్ దొడ్డిదారిన కంపెనీకి కోట్లు అందించిందని వివరించింది.
ఎస్‌టీపీఎల్‌లో అడాగ్‌కి 9.9 శాతం, మరో సంస్థ టైగర్ ట్రేడర్స్‌కి 90.1 శాతం వాటాలు ఉన్నట్లు చూపిస్తున్నారని. కానీ టైగర్ ట్రేడర్స్ కూడా రిలయన్స్ అడాగ్‌కి చెందిన కంపెనీయేనని తెలిపింది. స్పెక్ట్రం కేసులో సీబీఐ వాదనలు వినిపించింది. తదుపరి వాదనలు జులై 22న కూడా కొనసాగనున్నాయి.