ఏడాదిలో 5 లక్షల వైఫై హాట్‌స్పాట్స్‌ | Aiming for 5 lakh Wi-Fi hotspots by 2018 end | Sakshi
Sakshi News home page

ఏడాదిలో 5 లక్షల వైఫై హాట్‌స్పాట్స్‌

Published Fri, Jan 19 2018 11:50 AM | Last Updated on Sat, Aug 11 2018 8:24 PM

Aiming for 5 lakh Wi-Fi hotspots by 2018 end  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఈ సంవత్సరాంతానికి 5 లక్షల వైఫై హాట్‌స్పాట్స్‌ అందుబాటులోకి వస్తాయని టెలికాం కార్యదర్శి అరుణా సుందరరాజన్‌ చెప్పారు. ప్రతి గ్రామానికీ వైఫై హాట్‌స్పాట్‌ సదుపాయం ఉంటుందని చెప్పుకొచ్చారు. వైర్‌డ్‌ బ్రాడ్‌బ్యాండ్‌లో వెనుకబడిన భారత్‌ ఈ ఏడాది అద్భుత పురోగతి సాధిస్తుందన్నారు. 4జీ నెట్‌వర్క్‌కు వేగంగా అప్‌గ్రేడ్‌ అయ్యేందుకు టెలికాం కంపెనీలతో కసరత్తు సాగిస్తున్నామన్నారు.

ఆప్టిక్‌ ఫైబర్‌ కనెక్టివిటీ పెరిగిన తర్వాత గ్రామాలకూ 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ దిశగా భారత్‌ నెట్‌ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టామన్నారు. కాల్‌ డ్రాప్స్‌ సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. టెలికాం సేవల్లో నాణ్యత పెంచడమే లక్ష్యంగా చర్యలు చేపడతామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement