
ముంబై: మలేషియాకు చెందిన విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా దేశీయ, అంతర్జాతీయ ప్రయాణంపై భారీ తగ్గింపు ధరలను ప్రకటించింది. దేశీయ మార్గాల్లో ఒకవైపు ప్రయాణానికి టికెట్‌ను కేవలం రూ.99(బేస్ ఫేర్/పన్నులు, సర్‌చార్జీలు, ఫీజులు కాకుండా)కే పొందొచ్చని ఈ సంస్థ తెలిపింది. అలాగే, అంతర్జాతీయ మార్గాల్లో కేవలం రూ.444కే టికెట్‌ను బుక్ చేసుకోవచ్చని ప్రకటించింది.
పరిమిత కాలం పాటే ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. వచ్చే ఏడాది జనవరి – మే నెల మధ్య ప్రయాణాలకు సంబంధించి తాజా ఆఫర్లతో టికెట్లను ఈ నెల 19వ తేదీ వరకు ఎయిర్ ఏషియా వెబ్‌సైట్‌తోపాటు యాప్ నుంచి బుక్ చేసుకోవచ్చని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. దీనికి అదనంగా కోల్‌కతా నుంచి జోహార్ బహ్రు వెళ్లే వారికి ఎయిర్ ఏషియా బెర్హాద్ జీరో బేస్ చార్జీతోనే ప్రయాణానికి అనుమతిస్తున్నట్టు పేర్కొంది. విమాన ప్రయాణానికి కేవలం పన్నులు చెల్లిస్తే సరిపోతుందని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment