
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ రెండవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ భారతీ ఎయిర్‌టెల్ తన కస‍్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ఇంటర్నేషనల్ రోమింగ్ యాక్టివేషన్ రుసుమును నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఇది ప్రీ పెయిడ్, పోస్ట్ పెయిడ్ చందాదారులు ఇద్దరికీ వర్తిస్తుందని తెలిపింది. ఈమేరకు ఎయిర్‌టెల్ వినియోగదారులకు సీఈఓ గోపాల్ విట్టల్ ఈమెయిల్ సమాచారాన్ని అందించారు. ఇకపై తమ స్మార్ట్ ప్యాక్‌లతో అంతర్జాతీయ బిల్లుల భారం గురించి విచారించకండి అని తెలిపింది. తద్వారా ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్‌లను పెంచుకోవాలని చూస్తోంది..
Comments
Please login to add a commentAdd a comment