హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీ ఎయిర్‌టెల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సర్కిల్‌లో మిమో టెక్నాలజీ సాయంతో ప్రీ–5జీ సేవలను విస్తరిస్తోంది. ప్రముఖ బిజినెస్, రెసిడెన్షియల్ హబ్స్‌లో ప్రీ–5జీ అందుబాటులోకి రానుంది. దీని ద్వారా కస్టమర్లు హై స్పీడ్ డేటాను అందుకోవచ్చు.
ఇటీవల ఐపీఎల్ సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో మిమో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. దీంతో పాటు ఈ ఆర్థిక సంవత్సరంలో ఎయిర్‌టెల్ కొత్తగా 15,000 సెల్ టవర్లను ఏర్పాటు చేయనుంది. తన నెట్‌వర్క్‌కు 3,000 కిలోమీటర్ల మేర అదనపు ఆప్టిక్ ఫైబర్ కేబుల్‌ను జోడించనుంది కూడా. విస్తరణ ద్వారా హై స్పీడ్ మొబైల్ డేటాను మరిన్ని ప్రాంతాలకు పరిచయం చేస్తామని భారతి ఎయిర్‌టెల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఈవో అవనీత్ సింగ్ పురి బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు.
‘ఔటర్ రింగ్ రోడ్డులో 60 రోజుల్లో 100 శాతం నెట్‌వర్క్ అందుబాటులోకి వస్తుంది. 2017–18లో 10,000 టవర్లు, 500 కిలోమీటర్ల ఆప్టిక్ ఫైబర్ అనుసంధానించాం. 3 కోట్ల మంది కస్టమర్లున్న ఈ సర్కిల్‌లో 4జీ కవరేజీ 85 శాతం ఉంది’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment