ఇంటర్కనెక్ట్ జరిమానాపై స్పందిస్తాం: మిట్టల్
న్యూఢిల్లీ: రిలయన్స్ జియోకి తగినన్ని ఇంటర్‌కనెక్ట్ పాయింట్లు ఏర్పాటు చేయలేదనే అంశానికి సంబంధించి ట్రాయ్ తమపై డాట్‌కు సూచించిన జరిమానా విధింపు చర్యకు తగిన సమయంలో స్పందిస్తామని భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ తెలిపారు. ప్రభుత్వం స్పెక్ట్రమ్ ధర లను సవరిస్తే.. దాని వల్ల టెలికం ఇన్‌ఫ్రా ఏర్పాటు సులభతరం అవుతుందని పేర్కొన్నారు. ఆయన ఇక్కడ జరిగిన జీఎస్‌ఎంఏ కార్యక్రమంలో మాట్లాడారు. ఇంటర్‌కనెక్ట్ అంశం పెద్ద సమస్య కాదని చెప్పారు. లెసైన్స్ నిబంధనల అతిక్రమణ, జియోకి ఇంటర్‌కనెక్ట్ పాయింట్ల ఏర్పాటు చేయకపోవడం వంటి పలు అంశాల నేపథ్యంలో ఎయిర్‌టెల్, వొడాఫోన్‌లపై రూ.1,050 చొప్పున, ఐడియాపై రూ.950 కోట్ల జరిమానా విధించాలని రెగ్యులేటర్ ట్రాయ్.. డాట్‌కు సూచించింది.