హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆంధ్రా బ్యాంక్‌లో కేంద్ర ప్రభుత్వం వాటా మరో ఎనిమిది శాతం పెరిగింది. ప్రస్తుతం 61.02 శాతంగా ఉన్న కేంద్రం వాటా కొత్తగా సమకూర్చిన మూలధనంతో 69.21%కి చేరింది. గురువారం జరిగిన ఆంధ్రాబ్యాంక్ అసాధారణ సర్వసభ్య సమావేశంలో రూ. 76.42 ధరకు 4.94 కోట్ల షేర్లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్రం రూ. 378 కోట్ల మూలధనం సమకూర్చడంతో ఆ మేరకు షేర్లను జారీ చేస్తూ ఈజీఎం నిర్ణయం తీసుకుంది.