అమెజాన్ వ్యవస్థాకుడు, సీఇవో జెఫ్ బెజోస్(53) మరోసారి దూసుకుపోతున్నారు. ప్రపంచపు సరికొత్త 100 బిలియన్ డాలర్ల మొఘల్‌గా జెఫ్ బెజోస్ అవతరించారు. అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ నేపథ్యంలో బెజోస్ సంపద భారీ పెరుగుదలను నమోదు చేసింది. అమెజాన్ శుక్రవారం నాటి బంపర్ సేల్ తో 100బిలియన్ల డాలర్లకు చేరుకుంది. అమెజాన్ బ్లాక్ ఫ్రైడే బలమైన విక్రయాల గణాంకాల తర్వాత బెజోస్ నికర సంపద శుక్రవారం నాటికి 100.3 బిలియన్ డాలర్లకు ఎగిసి 12 అంకెల గ్రోత్ సాధించారు. దీంతో ఈ మోడరన్ ఎరాలో 100 బిలియన్ డాలర్ల సంపదను సాధించిన మొదటి వ్యక్తిగా నిలిచారు. 1999లో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ ఈ మార్క్‌ను అధిగమించారు.
ఆన్‌లైట్ రీటైలర్ అమెజాన్ ప్రకటించిన బ్లాక్ ఫ్రైడే సేల్ భారీ విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో అమెజాన్ షేర్ రికార్డు స్థాయిని నమోదు చేసింది. ఈ ఏడాదిలో 18.4 ఎగియగా ఈ ఒక్క వారంలోనే 5 శాతం జంప్ చేసింది. బెజోస్ సంపదకు మరో 1.7 బిలియన్ డాలర్లు జతచేరాయి. ఏడాది మొత్తంలో 32.6 బిలియన్ డాలర్లు పెరిగింది. ఈ అపరకుబేరుడి ఆస్తి విలువ మొత్తం 100 బిలియన్ డాలర్ల మైల్‌స్టోన్‌ను టచ్ చేసింది. అంతేకాదు 500 ప్రపంచ కుబేరుల రోజువారీ ర్యాంకింగ్‌లో హై జంప్ చేసింది. అమెజాన్‌లో బెజోస్‌కు 78.9మిలియన్ షేర్లు ఉన్నాయి.
కాగా బ్లూమ్బెర్గ్ ఇండెక్స్ ప్రకారం బిల్ గేట్స్ సంపద 86.8 బిలియన్ డాలర్లు. దాదాపు 700మిలియన‍్ల మైక్రోసాఫ్ట్ కార్పోరేషన్ షేర్లను, 2.9 బిలియన్ డాలర్ల నగదు, ఇతర ఆస్తులను స్వచ్ఛంద సంస‍్థలకు విరాళాలిచ్చారు. లేదంటే ఇప్పటికే బిల్‌గేట్స్ సంపద 150 బిలియన్ డాలర్లను అధిగమించి ఉండేదని నివేదించింది.
Comments
Please login to add a commentAdd a comment