ceo Jeff Bezos
-
అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ రికార్డు
అమెజాన్ ఫౌండర్, సీఈఓ జెఫ్ బెజోస్ సంపదలో మరోసారి రికార్డు సాధించారు. గత సంవత్సరం మెకెంజీతో విడాకుల పరిష్కారంలో భాగంగా అమెజాన్ లో తన వాటాలో నాలుగింట ఒక వంతును వదులుకున్న తర్వాత కూడా బెజోస్ సంపద 172 బిలియన్ డాలర్ల వద్ద మళ్లీ తారాస్థాయిని తాకింది. అమెజాన్ షేర్లు బుధవారం 4.4 శాతం పెరిగి రికార్డు స్థాయి 2,879 డాలర్లకు చేరింది. దీంతో ప్రపంచ కుబేరుడి బెజోస్ ఆదాయం 171.6 బిలియన్ డాలర్లకు పెరిగింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, సెప్టెంబర్ 4, 2018 నాటికి బెజోస్ సంపద 167.7 బిలియన్ డాలర్ల వద్ద రికార్డు స్థాయిని తాకింది. తాజాగా తన రికార్డును తనే బ్రేక్ చేశారు. కరోనా మహమ్మారి, మహామాంద్యం పరిస్థితులున్న ఈ ఏడాదిలోనే 56.7 బిలియన్లను ఆర్జించడం విశేషం. కరోనా సంక్షోభ సమయంలో ముందుండి పనిచేస్తున్న ఉద్యోగులకు వన్ టైం బోనస్ కింద 500 మిలియన్ డాలర్లు చెల్లించనున్నట్టు గత వారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వ్యవస్థాపకుడి రికార్డు సంపదపై వ్యాఖ్యానించడానికి అమెజాన్ నిరాకరించింది. మరోవైపు విడాకుల తర్వాత అమెజాన్‌లో 4 వాతం వాటాను సొంతం చేసుకున్న జెఫ్ బెజోస్ మాజీ భార్య మెకంజీ సంపద నికర విలువ 56.9 బిలియన్ డాలర్లు పెరిగింది. తద్వారా బ్లూమ్‌బెర్గ్ ర్యాంకింగ్‌లో 12వ స్థానాన్ని సాధించారు. అంతేకాదు ప్రపంచంలో రెండవ సంపన్న మహిళగా నిలిచారు. లోరియల్ కు చెందిన ఫ్రాంకోయిస్ బెటెన్ కోర్ట్ మేయర్స్ మొదటి మహిళగా ఉన్నారు. మిగిలిన బిలియనీర్లలో ఎక్కువ మంది టెక్ రంగానికి చెందినవారున్నారు. వీరిలో టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ సంపద జనవరి 1 నుండి 25.8 బిలియన్ డాలర్లు పెరిగింది. జూమ్ వీడియో కమ్యూనికేషన్స్ వ్యవస్థాపకుడు ఎరిక్ యువాన్ సంపద దాదాపు నాలుగు రెట్లు పెరిగి 13.1 బిలియన్ డాలర్లుకు చేరింది. కాగా కరోనా కాలంలో ప్రపంచ కుబేరుల సంపద స్వల్పంగా పెరిగింది. మరికొంత మంది భారీగా నష్టపోయారు. స్పెయిన్ కు చెందిన అమాన్సియో ఒర్టెగా 19.2 బిలియన్ డాలర్లను కోల్పోగా, బెర్క్‌షైర్ హాత్వే సంస్థ చైర్మన్ వారెన్ బఫ్ఫెట్ 19 బిలియన్ డాలర్లు, ఫ్రెంచ్ లగ్జరీ గూడ్స్ వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్ 17.6 బిలియన్ డాలర్లు సంపదను పోగొట్టుకున్నారు. 500 మంది ధనవంతుల మొత్తం సంపద ఈ సంవత్సరం ప్రారంభంలో 5.91 ట్రిలియన్ల డాలర్లతో పోలిస్తే స్పల్పంగా పుంజుకుని 5.93 ట్రిలియన్ డాలర్లకు చేరింది. -
అమెరికాలో అమెజాన్ బాస్‌కు చిక్కులు
వాష్టింగ్టన్ : టెక్ దిగ్గజం అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ అమెరికాలో మరోసారి చిక్కుల్లో పడ్డారు. తప్పుదోవ పట్టించే ప్రకటనల ఆరోపణలపై విచారణకు స్వచ్ఛందంగా హాజరు కావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. స్వచ్ఛందంగా హాజరు కావడానికి అంగీకరించకపోతే దావాను ఎదుర్కోవాల్సి వస్తుందంటూ అమెరికా అధికారులు ఆయన్ను హెచ్చరించారు. స్వయగా జెఫ్ బెజోస్ హాజరై తన సాక్ష్యమివ్వాలని ఆదేశించారు. ఈ మేరకు రెండు పార్టీలకు చెందిన హౌస్ జ్యుడిషియరీ కమిటీ నాయకులు బెజోస్‌కు శుక్రవారం రాసిన లేఖలో కోరారు. అమెజాన్ చేసిన ప్రకటనలు తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని నిరూపితమైతే మోసపూరిత, నేరపూరిత అపరాధంగా పరిగణిస్తామని కమిటీ ఛైర్మన్, రిపబ్లిక్ జెరోల్డ్ నాడ్లర్, ఇతరులుసంతకం చేసిన లేఖలో పేర్కొన్నారు. స్వచ్ఛంద ప్రాతిపదికన సాక్ష్యమిస్తారని ఆశిస్తున్నాం.. లేదంటే తప్పనిసరి ప్రక్రియను ఆశ్రయించే హక్కు తమకుందని స్పష్టం చేశారు. అయితే తాజా పరిణామంపై అమెజాన్ ప్రతినిధులు స్పందించాల్సి వుంది. అమెజాన్ తన మార్కెట్ ప్లేస్ లో అమ్మకందారుల గురించి, వారి ఉత్పత్తులు లావాదేవీల గురించి సున్నితమైన సమాచారాన్ని దాని సొంత పోటీ ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి ఉపయోగించిందని ఇటీవలి వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. అయితే అమెజాన్ ఎగ్జిక్యూటివ్ గత జూలైలో జరిగిన కమిటీ విచారణలో దీన్ని ఖండించారు. అమెరికాలోని జస్టిస్ డిపార్ట్ మెంట్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ ప్రధానంగా నాలుగు టెక్ దిగ్గజాలపై గత కొంతకాలంగా యాంటీట్రస్ట్ విచారణను కొనసాగిస్తున్నాయి. డేవిడ్ సిసిలిన్ నేతృత్వంలోని యాంటీట్రస్ట్ ఉపసంఘం గూగుల్, ఫేస్బుక్, అమెజాన్, ఆపిల్ లాంటి టెక్ దిగ్గజాలపై దృష్టి సారించింది. వినియోగదారులపై వాటి ప్రభావంపై సమగ్ర దర్యాప్తు జరుపుతోంది. ముఖ్యంగా జెఫ్ బెజోస్ వాషింగ్టన్ పోస్ట్ పత్రికను అడ్డం పెట్టుకుని తప్పుడు పద్ధతులను అవలంబిస్తున్నారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అమెజాన్ కంపెనీ భారీ ఇక్కట్లను ఎదుర్కొంటున్నసంగతి తెలిసిందే. (హెచ్ -1బీ వీసాదారులకు భారీ ఊరట) -
అమెజాన్ సీఈవో సంచలన ప్రకటన
ప్రముఖ ఆన్లైన్ వ్యాపారం దిగ్గజం అమెజాన్ పౌండర్, సీఈవో, జెఫ్ బెజోస్(54) సోషల్ మీడియా ద్వారా బుధవారం సంచలన ప్రకనట చేశారు. భార్య మెక్కెంజేతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించు కున్నట్టు ట్విటర్లో షాకింగ్ న్యూస్ వెల్లడించారు. మా జీవితాల్లో చోటుచేసుకున్న ఒక ముఖ్యమైన ఘట్టాన్ని హితులు, సన్నిహితుల దృష్టికి తీసుకొస్తున్నామంటూ ట్వీట్ చేశారు. పాతికేళ్లపాటు భార్యభర్తలుగా ఎంతో సంతోషంగా జీవించామనీ, అయితే విడాకులు తీసుకుంటున్నప్పటికీ స్నేహితులుగా కొనసాగుతామని తెలిపారు. పరస్పర ఆమోదంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని, అయితే ఉమ్మడి వెంచర్లు, ప్రాజెక్టుల్లో భాగస్వాములుగా కొనసాగుతామని సంయుక్త ప్రకనటలో తెలిపారు. మెకెంజీ (48) మంచి రచయిత్రి. న్యూయార్క్‌లో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్లిన సమయంలో 1993లో తొలిసారిగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వీరిద్దరి ప్రేమ చిగురించింది. ఆరునెలల తరువాత అదే సంవత్సరం పెళ్లి చేసుకున్నారు. వీరికి నలుగురు పిల్లలు. మెకెంజీ రెండు నవలలు కూడా రాశారు. భర్తే తన రచనలకు, మొదటి బెస్ట్ రీడర్ అని ఆమె చెప్పేవారు. రచనా వ్యాసంగంతోపాటు మెకంజీ బైస్టాండర్ రివల్యూషన్ (వేధింపులకు వ్యతిరేకంగా) అనే సంస్థను 2014లో ఏర్పాటు చేశారు. 1994లో ఆన్లైన్ బుక్సెల్లర్గా ఏర్పాటైన అమెజాన్ ఆ తర్వాత అంచలంచెలుగా ఎదిగి.. ప్రపంచ దిగ్గజ సంస్థల్లో ఒకటిగా నిలిచింది. అమెజాన్ సంస్థను ఏర్పాటు చేసిన తొలినాళ్లలో మెకంజీ తన బిజినెస్‌కు ఎంతో సహకారం అందించారని పలు సందర్భాల్లో జెఫ్ బిజోస్ గుర్తు చేసుకున్నారు. కేవలం రెండు రోజుల క్రితమే అమెజాన్ ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. అమెజాన్ భారీ మార్కెట్ క్యాప్‌తో మైక్రోసాఫ్ట్‌ను వెనక్కినెట్టి టాప్ ప్లేస్‌లో నిలిచిన సంగతి తెలిసిందే. ఎన్నో ప్రశ్నల్ని సశేషంగా మిగిల్చిన ఈ హఠాత్పరిణామం అమెజాన్ వాటాదారుల్లో తీవ్ర అందోళన రేపింది. అమెజాన్ యాజమాన్య మార్పునకు తీస్తుందా అనే సందేహాలు పరిశ్రమ వర్గాల్లో నెలకొన్నాయి. టీవీ యాంకర్‌తో చెట్టాపట్టాల్ ఇది ఇలా ఉంటే ఫాక్స్11 టీవీ యాంకర్ లారెన్ శాంచెజ్ ఇటీవల సన్నిహితంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. గత 8నెలలుగా కొన్ని ప్రముఖప్రదేశాల్లో జెఫ్, లారెన్ చెట్టా పట్టాలేసుకుని తిరుగుతూ సుమారు డజనుకు పైగా సార్లు తమ ఫోటోగ్రాఫర్లు కంట పడ్డారని యూకే ఆధారిత పత్రిక పేర్కొంది. జెఫ్ బెజోస్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు బ్లూ ఆరిజన్ కోసం ఒక ఏరియల్ వీడియో షూటింగ్ సందర్భంగా ఆమెను కలుసు కున్నారని తెలిపింది. అంతేకాదు గత ఆదివారం అమెజాన్ నిర్వహించిన గోల్డెన్ గ్లోబ్ పార్టీలో వీరిద్దరి కలిసి కనిపించారట. pic.twitter.com/Gb10BDb0x0 — Jeff Bezos (@JeffBezos) January 9, 2019 -
ప్రపంచ సరికొత్త అపర కుబేరుడు ఈయనే..
అమెజాన్ వ్యవస్థాకుడు, సీఇవో జెఫ్ బెజోస్(53) మరోసారి దూసుకుపోతున్నారు. ప్రపంచపు సరికొత్త 100 బిలియన్ డాలర్ల మొఘల్‌గా జెఫ్ బెజోస్ అవతరించారు. అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ నేపథ్యంలో బెజోస్ సంపద భారీ పెరుగుదలను నమోదు చేసింది. అమెజాన్ శుక్రవారం నాటి బంపర్ సేల్ తో 100బిలియన్ల డాలర్లకు చేరుకుంది. అమెజాన్ బ్లాక్ ఫ్రైడే బలమైన విక్రయాల గణాంకాల తర్వాత బెజోస్ నికర సంపద శుక్రవారం నాటికి 100.3 బిలియన్ డాలర్లకు ఎగిసి 12 అంకెల గ్రోత్ సాధించారు. దీంతో ఈ మోడరన్ ఎరాలో 100 బిలియన్ డాలర్ల సంపదను సాధించిన మొదటి వ్యక్తిగా నిలిచారు. 1999లో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ ఈ మార్క్‌ను అధిగమించారు. ఆన్లైట్ రీటైలర్ అమెజాన్ ప్రకటించిన బ్లాక్ ఫ్రైడే సేల్ భారీ విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో అమెజాన్ షేర్ రికార్డు స్థాయిని నమోదు చేసింది. ఈ ఏడాదిలో 18.4 ఎగియగా ఈ ఒక్క వారంలోనే 5 శాతం జంప్ చేసింది. బెజోస్ సంపదకు మరో 1.7 బిలియన్ డాలర్లు జతచేరాయి. ఏడాది మొత్తంలో 32.6 బిలియన్ డాలర్లు పెరిగింది. ఈ అపరకుబేరుడి ఆస్తి విలువ మొత్తం 100 బిలియన్ డాలర్ల మైల్‌స్టోన్‌ను టచ్ చేసింది. అంతేకాదు 500 ప్రపంచ కుబేరుల రోజువారీ ర్యాంకింగ్‌లో హై జంప్ చేసింది. అమెజాన్‌లో బెజోస్‌కు 78.9మిలియన్ షేర్లు ఉన్నాయి. కాగా బ్లూమ్‌బెర్గ్ ఇండెక్స్ ప్రకారం బిల్ గేట్స్ సంపద 86.8 బిలియన్ డాలర్లు. దాదాపు 700మిలియన్ల మైక్రోసాఫ్ట్ కార్పోరేషన్ షేర్లను, 2.9 బిలియన్ డాలర్ల నగదు, ఇతర ఆస్తులను స్వచ్ఛంద సంస్థలకు విరాళాలిచ్చారు. లేదంటే ఇప్పటికే బిల్‌గేట్స్ సంపద 150 బిలియన్ డాలర్లను అధిగమించి ఉండేదని నివేదించింది. -
దుమ్మురేపుతున్న అమెజాన్ సీఈవో ట్వీట్
లాస్ఏంజిల్స్: తరచూ ట్విట్టర్లో యాక్టివ్‌గా ఉంటే అమెజాన్ బాస్ తాజా ట్విట్‌తో దుమ్ము రేపుతున్నారు. ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్ ఫౌండర్, సీఈవో జెఫ్ బీజోస్ తనకు ఐడియాలు కావాలంటూ ట్వీట్ చేశారు. తన సంపాదనను దానం చేయాలనుకుంటున్నాననీ దీనికి సలహాలివ్వాంటూ ఫాలోయర్స్‌ను ఆహ్వానించారు. కోట్లాది రూపాయాలను విరాళం ఇవ్వాలనుకుంటున్నానని ప్రకటించారు. తాను ఇవ్వబోయే విరాళాన్ని ఖర్చు చేసేందుకు ఐడియాలు కావాలంటూ ఆ ట్వీట్లో కోరారు. ఆయన ట్వీట్ చేసిన కొన్ని గంటల్లోనే వేల రీట్వీట్లు, 10 వేల లైకులతో ట్విట్టర్ లో సంచలనంగా మారింది. సుమారు 15 వేల రిప్లయ్‌ల జోరు నడుస్తోంది. బ్లూఓరిజన్, వాషింగ్టన్పోస్ట్, అమెజాన్ సమాజంలో కోసం భారీ విరాళాలిస్తున్నప్పటికీ..తన ఆస్తుల్లో ఎక్కువ శాతం దానం చేయాలనుకుంటున్న జెఫ్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తన సొమ్ములో ఎక్కువ శాతం దానాలకే వినియోగిస్తానని.. కానీ ఇంకా చేయాలని కోరికగా ఉందన్నారు. అత్యవసరమైన, శాశ్వత ప్రభావాన్ని కలిగించేలా ప్రజలకు సహాయం చేయాలని అనుకుంటున్నానని దీనికి ఐడియాలు కావాలని చెప్పారు. ఒకవేళ ఇలా ప్రకటించడం తప్పనిపిస్తే.. ఆ విషయాన్ని కూడా నిర్మొహమాటంగా తనకు తెలియజేయాలని కోరారు. కాగా జెఫ్ బేజోస్ మొత్తం ఆస్తివిలువ సుమారు 76 బిలియన్ల డాలర్లుగా ఉంది. ఫ్రెడ్ హచిన్సన్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ బెజోస్ కుటుంబం ఇటీవల భారీ విరాళాన్ని అందించింది. వీరినుంచి 35 మిలియన్ డాలర్లను అందుకున్నట్లు రీసెర్చ సెంటర్ గత నెలలో ప్రకటించింది. 41 సంవత్సరాల తమ సేవల్లో ఇదే అతిపెద్ద సింగిల్ విరాళమని ప్రకటించడం విశేషం. Request for ideas… pic.twitter.com/j6D68mhseL — Jeff Bezos (@JeffBezos) June 15, 2017 -
వారెవ్వా.. అమెజాన్ ఫాస్టెస్ట్ డెలివరీ!
డెలివరీ బాయ్స్ స్థానంలో డ్రోన్లు అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ ఆన్లైన్ షాపింగ్ రోజురోజుకు అభివృద్ధి చెందుతోంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ లాంటి సంస్థలు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని అన్ని రకాల వస్తు సేవలు అందిస్తున్నాయి. ఇంటర్ నెట్లో ఆర్డర్ చేస్తే చాలు డెలివరీ బాయ్ నిర్ణీత సమయంలో కస్టమర్‌కు ఆర్డర్ చేసిన ఐటమ్ అందిస్తాడు. అయితే అమెజాన్ మాత్రం కాస్త భిన్నంగా ఆలోచిస్తుంది. డెలివరీ బాయ్ ప్లేస్‌ను డ్రోన్లకు అప్పగించనుంది. అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ తన ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించారు. మీరు చదివింది నిజమే.. కస్టమర్లకు అతివేగంగా సర్వీస్ అందజేయాలని భావించిన అమెజాన్ సంస్థ డ్రోన్ల ద్వారా సర్వీస్ అందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఇంగ్లండ్ లోని కేంబ్రిడ్జి నగరానికి చెందిన ఓ వ్యక్తి ఈమెయిల్ ద్వారా ఫైర్ టీవీ, పాప్ కార్న్ ఆర్డర్ ఇచ్చాడు. ఇలా ఆర్డర్ ఇచ్చాడో లేదో కేవలం 13 నిమిషాల్లోనే ఆ కస్టమర్ కు డ్రోన్ ద్వారా ఐటమ్స్ డెలివరీ ఇచ్చారు. కస్టమర్ అయితే కలనా.. నిజమా.. అనే ఆశ్చర్యపోయారని సంస్థ తెలిపింది. First-ever #AmazonPrimeAir customer delivery is in the books. 13 min—click to delivery. Check out the video: https://t.co/Xl8HiQMA1S pic.twitter.com/5HGsmHvPlE — Jeff Bezos (@JeffBezos) 14 December 2016