వారెవ్వా.. అమెజాన్ ఫాస్టెస్ట్ డెలివరీ!
- డెలివరీ బాయ్స్ స్థానంలో డ్రోన్లు
- అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్
ఆన్‌లైన్ షాపింగ్ రోజురోజుకు అభివృద్ధి చెందుతోంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ లాంటి సంస్థలు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని అన్ని రకాల వస్తు సేవలు అందిస్తున్నాయి. ఇంటర్ నెట్లో ఆర్డర్ చేస్తే చాలు డెలివరీ బాయ్ నిర్ణీత సమయంలో కస్టమర్‌కు ఆర్డర్ చేసిన ఐటమ్ అందిస్తాడు. అయితే అమెజాన్ మాత్రం కాస్త భిన్నంగా ఆలోచిస్తుంది. డెలివరీ బాయ్ ప్లేస్‌ను డ్రోన్లకు అప్పగించనుంది. అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ తన ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించారు.
మీరు చదివింది నిజమే.. కస్టమర్లకు అతివేగంగా సర్వీస్ అందజేయాలని భావించిన అమెజాన్ సంస్థ డ్రోన్ల ద్వారా సర్వీస్ అందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఇంగ్లండ్ లోని కేంబ్రిడ్జి నగరానికి చెందిన ఓ వ్యక్తి ఈమెయిల్ ద్వారా ఫైర్ టీవీ, పాప్ కార్న్ ఆర్డర్ ఇచ్చాడు. ఇలా ఆర్డర్ ఇచ్చాడో లేదో కేవలం 13 నిమిషాల్లోనే ఆ కస్టమర్ కు డ్రోన్ ద్వారా ఐటమ్స్ డెలివరీ ఇచ్చారు. కస్టమర్ అయితే కలనా.. నిజమా.. అనే ఆశ్చర్యపోయారని సంస్థ తెలిపింది.
First-ever #AmazonPrimeAir customer delivery is in the books. 13 min—click to delivery. Check out the video: https://t.co/Xl8HiQMA1S pic.twitter.com/5HGsmHvPlE
— Jeff Bezos (@JeffBezos) 14 December 2016