ఫ్లిప్ కార్ట్, అమెజాన్ ల మధ్య బిగ్ ఫైట్!
బెంగళూరు: ఆన్ లైన్ వ్యాపారంలో ఫ్లిప్ కార్ట్ తో తీవ్రమైన పోటీ ఎదురవుతున్ననేపథ్యంలో అమెజాన్.కామ్ సంస్థ భారీగా పెట్టుబడులను సమకూర్చుకుంది. తాజాగా ఫ్లిప్ కార్ట్ 1 బిలియన్(ఆరువేల కోట్లు) సమకూర్చుకున్న నేపథ్యంలో అమెజాన్ 2 బిలియన్ డాలర్ల (12 వేల కోట్లు) పెట్టుబడులను సమకూర్చకున్నట్టు కంపెనీ అధికారులు తెలిపారు.
అదనంగా సమకూరిన 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో భారీ ప్రణాళికలను రూపొందించడానికి, సుజనాత్మకతను మెరుగు పరుచుకునేందుకు, భారత్ లో పెద్ద ఎత్తున కస్టమర్లను ఆకర్సించుకునేందుకు వినియోగించుకోనున్నట్టు అమెజాన్ ప్రతినిధులు మీడియాకు వెల్లడించారు.
ఇప్పటి వరకు దేశంలో అమెజాన్ ఐదు గిడ్డంగులు ఉండగా, ప్రస్తుతం వాటిని రెండింతలు చేసే ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఇందుకోసం 5 లక్షల చదరపు అడుగుల స్టోరేజ్ కెపాసిటీకి పెంచాలని నిర్ణయం తీసుకుంది.