న్యూఢిల్లీ : ఆధార్‌పై రోజుకో రిపోర్టులు ప్రజలను ఆందోళనలో పడేస్తున్నాయి. నిన్న కాక మొన్న కేవలం రూ.500కే ఆధార్ వివరాలు అమ్ముతున్నారని రిపోర్టులు వెలువడగా.. సైబర్ క్రిమినల్స్‌కు ఆధార్ సింగిల్ టార్గెట్‌గా ఉంటుందంటూ ఆర్‌బీఐ అధికారులు హెచ్చరించారు. ఈ ఆందోళనకరమైన రిపోర్టుల మధ్య మరో సంచలన రిపోర్టులు వెలుగులోకి వచ్చింది. ఆధార్ నెంబర్‌తో మీరు ఏ బ్యాంకు అకౌంట్ కలిగి ఉన్నారో ట్రేస్ చేయొచ్చని తెలుస్తోంది. దీంతో ఎవరికైనా మీ ఆధార్ ఐడీ తెలిస్తే, వారు దానితో అనుసంధానమై ఉన్న బ్యాంకు అకౌంట్ వివరాలు తెలుసుకుంటారని తాజా రిపోర్టులు తెలిపాయి. ఎస్‌ఎంఎస్ ద్వారా ఆధార్‌తో అనుసంధానమై ఉన్న బ్యాంకు అకౌంట్ వివరాలను ఎవరైనా తెలుసుకోవచ్చని గత డిసెంబర్‌లో యూఐడీఏఐ ట్వీట్ చేసింది. దీని కోసం ఓ ప్రక్రియను కూడా తీసుకొచ్చింది.
- తొలుత మీ ఫోన్ ద్వారా *99*99*1#కు డయల్ చేయాలి
- స్క్రీన్‌పై ఓ డైలాగ్ బాక్స్ వస్తోంది. దానిలో ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
- మీరు ఎంటర్ చేసిన ఆధార్ నెంబర్ కచ్చితమైనదని తెలుపుతూ కన్‌ఫాం నొక్కాల్సి ఉంటుంది.
- దీంతో ఆ ఆధార్ నెంబర్‌కు లింక్ అయి ఉన్న బ్యాంకు అకౌంట్ పేరు డిస్‌ప్లే అవుతాయి.
అయితే ఏఎస్‌ఏపీ మొబైల్ ఓటీపీ వెరిఫికేషన్‌తో ఈ సర్వీసును సురక్షితం చేయాలని యూజర్లు కోరుతారు. లేకపోతే బ్యాంకు అకౌంట్ వివరాలు దుర్వినియోగమయ్యే అవకాశాలున్నాయని ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. పైన ప్రక్రియలో ఎక్కడా కూడా ఓటీపీ కానీ, రిజిస్ట్రర్ మొబైల్ నెంబర్ కానీ అవసరం లేదు. దీంతోనే ఎవరి బ్యాంకు వివరాలైనా ఎవరైనా తెలుసుకునే అవకాశముంటోంది. బ్యాంక్‌తో లింక్ అయి ఉన్న సమాచారం ఎవరైనా చెక్ చేస్తున్నారో తెలిపే విధానం కూడా లేదు.
Comments
Please login to add a commentAdd a comment