Bank Account Details
-
నిబంధనలు పాటించని బ్యాంకులపై చర్యలు
భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం కేవైసీ అమలులో సరైన విధానాలు పాటించని బ్యాంకులపై చర్యలు తప్పవని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్ అన్నారు. సరైన పద్ధతిలో కేవైసీ పూర్తి చేయకుండా కొన్ని బ్యాంకులు ఇప్పటికే నిబంధనలను బేఖాతరు చేస్తున్నాయని చెప్పారు. దాంతో ఈ ప్రక్రియ పూర్తి చేయని బ్యాంకు కస్టమర్లు ప్రభుత్వం అందించే ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డీబీటీ) నిధులను పొందలేకపోతున్నారని పేర్కొన్నారు.ప్రైవేట్ రంగ బ్యాంకుల డైరెక్టర్లతో జరిగిన సమావేశంలో స్వామినాథన్ మాట్లాడుతూ..‘బ్యాంకులు కేవైసీ మార్గదర్శకాలను సరైన పద్ధతిలో అమలు చేస్తున్నట్లు నిర్ధారించుకోవాలి. కస్టమర్ల నుంచి కేవైసీ పూర్తి చేయాల్సిన బాధ్యత బ్యాంకులదే. దాన్ని సాకుగా చూపి ప్రభుత్వ డీబీటీ నగదును వినియోగదారులకు చెందకుండా చర్యలు తీసుకోకూడదు. కస్టమర్లు కేవైసీ పూర్తి చేసేందుకు బ్యాంకులు విభిన్న మార్గాలు అన్వేషించాలి. లేదంటే మనీ లాండరింగ్‌కు అవకాశం ఉంటుంది. కస్టమర్ల కేవైసీ వివరాలను కాలానుగుణంగా అప్డేట్ చేయడంలో బ్యాంకులకు సమస్యలు ఎదురవుతున్నాయి. ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో సిబ్బందిని తగినంతగా నియమించుకోవాలి. కేవైసీ అప్డేట్ కోసం కస్టమర్లు హోమ్ బ్రాంచ్‌లో సంప్రదించాల్సి ఉంటుంది. ఈమేరకు కస్టమర్లకు వివరాలు తెలియజేయడంతో బ్యాంకులు విఫలమవుతున్నాయి. ఒకవేళ పత్రాలు బ్యాంకులో సమర్పించినా కేవైసీ అప్డేట్ చేయడంలో కాలయాపన చేస్తున్నారు’ అని తెలిపారు.ఇదీ చదవండి: గోల్డ్ లోన్ చెల్లింపు విధానంలో మార్పులుఅంతర్గత అంబుడ్స్‌మన్ ఏర్పాటు చేయడంతోపాటు వినియోగదారు ఫిర్యాదుల యంత్రాంగంపై ఆందోళనలున్నాయని స్వామినాథన్ తెలిపారు. బ్యాంకులో నెలకొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించేలా అంతర్గత అంబుడ్స్‌మన్ యంత్రాంగం పని చేయాలని సూచించారు. -
ఆర్బీఐ ద్వారా ఎన్పీఆర్
ముంబై: జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్) అప్‌గ్రెడేషన్‌పై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నప్పటికీ కేంద్రం వెనక్కి తగ్గేలా లేదు. 2015 నాటి ప్రతిపాదనలను తెరపైకి తెచ్చి, తాజాగా బ్యాంకుల ద్వారా వివరాలను సేకరించేందుకు యోచిస్తోంది. మనీల్యాండరింగ్ నిబంధనలు–2005ను సవరిస్తూ కేంద్ర ఆర్థిక శాఖలోని రెవెన్యూ విభాగం 2015 జూలై 7వ తేదీన రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)కి ఒక సర్క్యులర్ జారీ చేసింది. వినియోగదారుల నుంచి అధికారిక ధ్రువీకరణ పత్రాలతోపాటు ‘నో యువర్ కస్టమర్’ వివరాల్లో భాగంగా ఎన్పీఆర్ను సేకరించాలని అందులో సూచించింది. కారణాలు వెల్లడి కానప్పటికీ, మూడేళ్ల తర్వాత ఆర్బీఐ 2018 ఏప్రిల్‌లో కేవైసీలో ఎన్పీఆర్ను భాగంగా మార్చుతూ ఆదేశాలిచ్చింది. అయితే, ఈ నెల 9వ తేదీన దీనిని ఆర్బీఐ ప్రకటించడంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమయింది. ‘బ్యాంకింగ్ కార్యకలాపాలు, కొత్త అకౌంట్లకు ఈ వివరాలు తీసుకోవాలన్న ఆర్బీఐ సూచనలను అమలు చేస్తున్నాం. కొందరు భావిస్తున్నట్లుగా ఎన్పీఆర్ వివరాలివ్వడం తప్పనిసరి మాత్రం కాదు’అని ఆర్బీఐ ఎండీ పల్లవ్ మహాపాత్ర తెలిపారు. కాగా, కేరళ ప్రభుత్వం ఎన్పీఆర్ విషయంలోనూ కేంద్రంతో విభేదిస్తోంది. ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆందోళనల దృష్ట్యా దీనిని అమలు చేయబోమని కేంద్రానికి తెలపాలని సీఎం విజయన్ నేతృత్వంలో కేబినెట్ భేటీ నిర్ణయించింది. ఎన్సార్సీని అమలు చేయబోమంటూ కేరళ అసెంబ్లీ తీర్మానం చేసిన విషయం తెలిసిందే. -
దాతల వివరాలివ్వండి
న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు అందే నిధులపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అందిన మొత్తం, దాతల బ్యాంకు అకౌంట్ల వివరాలను ఎన్నికల సంఘాని(ఈసీ)కి అందజేయాలని రాజకీయ పార్టీలను కోరింది. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత సాధించేందుకు ఎలక్టోరల్ బాండ్ల జారీని నిలిపివేయాలి లేదా బాండ్లను కొనుగోలు చేసే దాతల వివరాలను బహిర్గతం చేయాలంటూ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) సంస్థ వేసిన పిటిషన్‌పై సీజేఐ జస్టిస్ గొగోయ్ నేతృత్వంలోని బెంచ్ ఎదుట గురువారం వాదనలు పూర్తయ్యాయి. శుక్రవారం ధర్మాసనం ఇందుకు సంబంధించి మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ప్రస్తుతానికి బాండ్ల జారీ ప్రక్రియలో జోక్యం చేసుకోబోమన్న బెంచ్.. బాండ్ల జారీ విధానానికి అనుగుణంగా ఐటీ, ఎలక్టోరల్, బ్యాంకింగ్ చట్టాల్లో కేంద్రం తీసుకువచ్చిన మార్పులతోపాటు అవి రాజకీయ పార్టీలన్నిటికీ సమానంగా వర్తిస్తున్నాయా లేక ఏ రాజకీయ పార్టీకైనా అనుకూలంగా ఉన్నాయా అనేది సమీక్షిస్తామంది. బాండ్ల ద్వారా అందిన మొత్తం, దాతల బ్యాంకు అకౌంట్ల వివరాలను సీల్డు కవర్లో మే 30లోగా ఈసీకి అందజేయాలని పార్టీలను కోరింది. ఏప్రిల్– మేలో జారీ చేసే బాండ్ల గడువును 5 రోజులకు కుదించాలని ఆర్థిక శాఖకు సూచించింది. ఏడీఆర్ పిటిషన్‌పై తుది తీర్పు వెలువరించే తేదీని ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత ప్రకటిస్తామని స్పష్టతనిచ్చింది. రాజకీయ పార్టీలకు అందే నిధుల్లో పారదర్శకత పెంచే లక్ష్యంతో జారీ చేస్తున్న ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసేదెవరో తెలియనప్పుడు ఎన్నికల్లో నల్లధనాన్ని కట్టడి చేయడం ఎలా సాధ్యమని గురువారం విచారణ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. ప్రస్తుతానికి ఈ విధానంలో జోక్యం చేసుకోరాదని, ఎన్నికలు ముగిసిన తర్వాతే ఇది ఎలా పనిచేస్తుందో పరిశీలించాలని కేంద్రం చేసిన వాదనను కోర్టు తిరస్కరించింది. స్వాగతించిన కాంగ్రెస్ సుప్రీంకోర్టు ఉత్తర్వులను కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. రాజకీయ పార్టీలకు అందే నిధులు, వాటి నిర్వహణ విషయంలో పారదర్శకత పాటించాలని తాము ఎప్పటినుంచో కోరుతున్నామని పార్టీ ప్రతినిధి ప్రియాంక చతుర్వేది పేర్కొన్నారు. సుప్రీం తాజా ఉత్తర్వుల ఫలితంగా కాషాయ పార్టీ– సూటుబూటు స్నేహితులకు మధ్య ఉన్న బంధం బయటపడనుందని ఆమె వ్యాఖ్యానించారు. బీజేపీ వాదన వీగిపోయింది: సీపీఎం బాండ్ల విషయంలో ప్రభుత్వం చేస్తున్న వాదనలో పసలేదని సుప్రీంకోర్టు తేల్చిందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ‘పార్టీలకు నల్లధనాన్ని విరాళంగా ఇవ్వాలనుకునే దాతలు వెనుకంజ వేస్తారు. అటువంటి దాతలు ఎవరనే విషయం ఇకపై ప్రజలకు సైతం తెలుస్తుంది’ అని అన్నారు. తుది తీర్పు కోసం చూస్తాం: బీజేపీ ఎలక్టోరల్ బాండ్ల జారీపై సుప్రీంకోర్టు తుది తీర్పుకోసం ఎదురుచూస్తున్నట్లు బీజేపీ పేర్కొంది. ఇప్పటికే తమ అభిప్రాయాన్ని న్యాయస్థానం ముందుంచినట్లు తెలిపింది. ఆ పార్టీ ప్రతినిధి, లాయర్ నళిన్ కోహ్లి స్పందిస్తూ..‘సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు ఎలాంటిదైనా ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటాం. ప్రభుత్వం తన అభిప్రాయాన్ని కోర్టుకు తెలిపింది. దీనిపై తుది తీర్పు కోసం వేచి చూస్తాం’ అని పేర్కొన్నారు. -
అనుమానిత బ్యాంకు లావాదేవీలపైనే మా దృష్టి
సాక్షి, వరంగల్ రూరల్: ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అడ్డుకునేందుకు ఎలక్షన్ కమిషన్ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుంది. నామినేషన్ల పర్వం నేటితో ముగయనుంది. ఎన్నికల ప్రచారానికి తక్కువ సమయం ఉండటంతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రాజకీయ పార్టీల నాయకులు వివిధ మార్గాల్లో తమ ప్రయత్నాలు ప్రారంభించారు. డబ్బులతో ఓటర్లను ఆకట్టుకునేందుకు వేస్తున్న ఎత్తుగడలను అడ్డుకునేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపట్టింది. అనుమానిత బ్యాంకు లావాదేవీలపై దృష్టిపెట్టాలని అధికారులకు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాలిచ్చారు. ఒకేసారి ఖాతాల్లో నగదు జమకావడం గతంలో తక్కువ లావాదేవీలు జరిగిన ఖాతాల్లో ఈ మధ్య ఎక్కువగా నిర్వహిస్తే వెంటనే నిఘా పెంచాలని ఆదేశాలు జారీఅయ్యాయి. వరంగల్ ఉమ్మడి జిల్లాలో జీరో ఖాతాల విషయంలో కూడా లోతుగా పరిశీలన చేస్తున్నారు. జిల్లా సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటుచేశారు. చెక్ పోస్టుల వద్ద తనిఖీల్లో ఇప్పటి వరకు రూరల్ జిల్లాలో రూ. 5.74 లక్షల రూపాయలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత వ్యక్తులు ఆధారాలు చూపించి డబ్బులను తీసుకెళ్లారు. జనగామ జిల్లాలో తొమ్మిది చెక్‌పోస్టులు ఏర్పాటుచేశారు. ఇప్పటి వరకు 24లక్షల 60వేల రూపాయలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మహబూబాబాద్ జిల్లాలో 10 చెక్‌పోస్టుల వద్ద 49 లక్షల రూపాయలు పట్టుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఏడు చెక్‌పోస్టులు ఏర్పాటుచేశారు. 10 లక్షల రూపాయలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత వ్యక్తులు ఆధారాలు చూపించిన వారికి డబ్బులు తిరిగి ఇచ్చేశారు. అభ్యర్థుల లావాదేవీలపై ఒక్కో అభ్యర్థి ఎన్నికల నిబంధనల ప్రకారం రూ.28 లక్షలు మాత్రమే ఖర్చుచేయాలి. రోజువారి ఖర్చుల వివరాలను సైతం ఎన్నికల అధికారులకు చెప్పాలి. ఒకసారి నామినేషన్ ప్రక్రియ పూర్తయితే ఆ తర్వాత జరిగే ప్రతి లావాదేవీలు ఎన్నికల వ్యయంగా పరిగణిస్తారు. కొంత మంది అభ్యర్థులు తమ పేర్ల మీద కాకుండా బినామీల పేర్లతో ఎక్కువగా లావాదేవీలు చేస్తుంటారు. ఇప్పటికే బరిలో నిలిచిన అభ్యర్థులు డబ్బులను సమకుర్చుకుంటున్నారు. పరిమితి దాటితే పరిశీలన ఎన్నికల సమయంలో బ్యాంకుల్లోని ఖాతాలపై ఆదాయపు పన్ను, పోలీస్‌శాఖ నిఘా పెట్టింది. ముఖ్యంగా జీరో అకౌంట్లపై అధికారులు ప్రత్యేకదృష్టి సారించారు. సాధారణంగా రూ 49,999 లావాదేవీలపై ఆంక్షలు ఉండవు. రూ.50 వేలు దాటితే పాన్‌కార్డు నెంబర్‌ను తప్పనిసరిగా బ్యాంక్ అధికారులకు అందించాలి. ఎన్నికల నేపథ్యంలో కన్నేసిన నిఘా అధికారులు ఏమాత్రం అనుమానం కలిగినా సంబంధిత ఖాతాలు ఆరా తీస్తున్నారు. లక్ష రూపాయలకు మించి లావాదేవీలు జరిగిన ఖాతాలపై అధికారులు దృష్టిసారిస్తున్నారు. డిజిటల్ లావాదేవీల ద్వారా డబ్బులు చేర్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను గుర్తించిన అధికారులు వాటిపైన సైతం దృష్టి సారించారు. బలహీన వర్గాలైన మహిళా సంఘాల సభ్యులు, ఉపాధి హామీ కూలీలు, పింఛన్‌దారుల ఖాతాలపై అధికారులు దృష్టి సారించారు. పరిమితికి మించి లావాదేవీలు జరిగిన ఖాతాల వివరాలను బ్యాంక్ అధికారులు వెంటవెంటనే ఎన్నికల అధికారులకు సమాచారం అందిస్తున్నట్లు తెలిసింది. -
ట్యాక్స్ రీఫండ్ ఎస్ఎంఎస్.. క్లిక్ చేశారో
మోసానికి కాదేదీ అనర్హం అన్నట్టు తయారైంది ఇటీవల కాలంలో. సైబర్ నేరాలు అంతకంతకు కొత్త కొత్త మార్గాల్లో విజృంభిస్తున్నారే తప్ప, అసలు తగ్గడం లేదు. తాజాగా ఓ సైబర్ క్రైమ్ రాకెట్ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వచ్చే ఎస్ఎంఎస్ రూపంలో పన్ను చెల్లింపుదారులను దగా చేస్తోంది. ఐటీ రిటర్నులకు తుది గడువు దగ్గర పడుతున్న క్రమంలో ఐటీ డిపార్ట్మెంట్ నుంచి పంపిస్తున్నట్టు సైబర్ నేరగాళ్లు ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్‌కు సంబంధించి ఈ ఎస్ఎంఎస్ను పన్నుచెల్లింపుదారులకు సెండ్ చేశారు. తప్పుడు బ్యాంక్ అకౌంట్ నెంబర్‌తో మీ ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్‌ను టార్గెట్ చేశారని ఆ మెసేజ్‌లో చెప్పారు. మీ అకౌంట్ నెంబర్ సరియైనదో కాదో చెక్ చేసుకోవాలని, ఒకవేళ కాకపోతే, మెసేజ్‌లో ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేసి, సరిచేసుకోవాలని సైబర్ నేరగాళ్లు కోరారు. ఆ మెసేజ్ నిజంగానే ఐటీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిందని భావించి, ఈ లింక్‌ను క్లిక్ చేస్తే, ఇక పన్ను చెల్లింపుదారుల పని అంతే అట. అలా క్లిక్ చేస్తే అచ్చం ఐటీ డిపార్ట్మెంట్ వెబ్సైట్లోకి ఎంట్రి అయినట్టు ఉంటుంది. కానీ అది అధికారిక ఐటీ డిపార్ట్మెంట్ కాదు. లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌తో ఎంటర్ కావాలని సైబర్ క్రిమినల్స్ కోరతారు. ఆ తర్వాత స్టెపులో బ్యాంక్ అకౌంట్ అకౌంట్ వివరాలు అడుగుతారు. ఆ వెబ్సైట్ నిజమేమో అనుకుని బ్యాంక్ అకౌంట్ వివరాలు నమోదు చేసిన వారు, సైబర్ క్రిమినల్స్ బారిన పడుతున్నారు. దీనిపై నెల క్రితమే కేసు నమోదైంది. ప్రస్తుతం ఈ కొత్త సైబర్ రాకెట్‌పై విచారణ చేపట్టినట్టు సైబర్ క్రైమ్ తెలిపింది. పన్ను చెల్లింపుదారులు నమోదు చేసిన లాగిన్ వివరాలతో, సైబర్ నేరగాళ్లు ఐటీ డిపార్ట్మెంట్ వెబ్సైట్లోకి వెళ్లి, వారి ఐటీ ఫండ్స్‌ను తమతమ అకౌంట్లలోకి బదిలీ చేసుకుంటున్నారు. అంతేకాక ఐటీ డిపార్ట్మెంట్ రికార్డుల్లో ఉన్న ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీని కూడా సైబర్ నేరగాళ్లు మార్చేస్తున్నారు. ఈ డేటాను వారు వేరే వాళ్లకి అమ్మేస్తున్నారు కూడా. ఇదే రకమైన కేసును గతేడాది థానే పోలీసులు చేధించారు. ఇంటర్నల్ రెవెన్యూ సర్వీసు అధికారుల మాదిరి అమెరికన్ సిటిజన్లను మోసం చేసిన భారతీయులను అరెస్ట్ చేశారు. ఈ అనుమానిత మెసేజ్‌లకు స్పందించకుండా దూరంగా ఉండాలని ఆదాయపు పన్ను విభాగం పన్ను చెల్లింపుదారులను హెచ్చరిస్తోంది. -
ఆధార్ లీకేజీ కలకలం!
న్యూఢిల్లీ: ఆధార్ భద్రతపై వెల్లువెత్తుతున్న అనుమానాలకు మరో రుజువు దొరికింది. ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ విభాగానికి చెందిన ఓ కంప్యూటర్లో ఆధార్ కార్డు ఉన్న వారి వ్యక్తిగత సమాచారం, పేర్లు, 12 అంకెలుండే ఆధార్ నంబర్‌తోపాటు బ్యాంక్ అకౌంట్ల వివరాలు కూడా లభ్యమయ్యాయని బిజినెస్ టెక్నాలజీ న్యూస్ వెబ్సైట్ జెడ్డీ నెట్ తెలిపింది. అయితే, ఏ సంస్థ కంప్యూటర్లలో ఇలా ఆధార్ సమాచారం దొరుకుతోందో జెడ్డీ నెట్ వెల్లడించలేదు. అయితే, ఈ పరిణామం ఆధార్ భద్రతను ప్రశ్నార్ధకం చేస్తోందని నిపుణులు అంటున్నారు. ఆధార్ వివరాలు తెలుసుకునేందుకు ముందుగా యూనిఫాం రిసోర్స్ లొకేటర్‌ను గుర్తించాల్సి ఉంటుంది..దీనిని కేవలం 20 నిమిషాల్లోనే కనిపెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొన్ని ప్రభుత్వ సంస్థల కంప్యూటర్లలో ఇటువంటివి జరుగుతున్నట్లు తెలిసినా వాటిని సరిదిద్దేందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోలేదన్నారు. అయితే, ఆధార్ సమాచారం లీకవుతోందంటూ వచ్చిన వార్తలను యూఐడీఏఐ ఖండించింది. ఆధార్ వివరాలకు పూర్తి భద్రత, రక్షణ ఉందని తెలిపింది. లీకేజీ వాస్తవమనుకున్నప్పటికీ వెల్లడైన సమాచారం ఆ రాష్ట్ర ప్రభుత్వ విభాగానికి చెందినదై ఉంటుందనీ, దానికి ఆధార్‌తో ఎటువంటి సంబంధం లేదని తెలిపింది. ఆధార్ సంఖ్య తెలిసినా∙పూర్తి వ్యక్తిగత సమాచారం లీకయినట్లు కాదని పేర్కొంది. -
ఒక్క ఆ నెంబర్‌తో బ్యాంకు వివరాలు బహిర్గతం
న్యూఢిల్లీ : ఆధార్‌పై రోజుకో రిపోర్టులు ప్రజలను ఆందోళనలో పడేస్తున్నాయి. నిన్న కాక మొన్న కేవలం రూ.500కే ఆధార్ వివరాలు అమ్ముతున్నారని రిపోర్టులు వెలువడగా.. సైబర్ క్రిమినల్స్‌కు ఆధార్ సింగిల్ టార్గెట్‌గా ఉంటుందంటూ ఆర్బీఐ అధికారులు హెచ్చరించారు. ఈ ఆందోళనకరమైన రిపోర్టుల మధ్య మరో సంచలన రిపోర్టులు వెలుగులోకి వచ్చింది. ఆధార్ నెంబర్‌తో మీరు ఏ బ్యాంకు అకౌంట్ కలిగి ఉన్నారో ట్రేస్ చేయొచ్చని తెలుస్తోంది. దీంతో ఎవరికైనా మీ ఆధార్ ఐడీ తెలిస్తే, వారు దానితో అనుసంధానమై ఉన్న బ్యాంకు అకౌంట్ వివరాలు తెలుసుకుంటారని తాజా రిపోర్టులు తెలిపాయి. ఎస్ఎంఎస్ ద్వారా ఆధార్‌తో అనుసంధానమై ఉన్న బ్యాంకు అకౌంట్ వివరాలను ఎవరైనా తెలుసుకోవచ్చని గత డిసెంబర్లో యూఐడీఏఐ ట్వీట్ చేసింది. దీని కోసం ఓ ప్రక్రియను కూడా తీసుకొచ్చింది. తొలుత మీ ఫోన్ ద్వారా *99*99*1#కు డయల్ చేయాలి స్క్రీన్‌పై ఓ డైలాగ్ బాక్స్ వస్తోంది. దానిలో ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎంటర్ చేసిన ఆధార్ నెంబర్ కచ్చితమైనదని తెలుపుతూ కన్ఫాం నొక్కాల్సి ఉంటుంది. దీంతో ఆ ఆధార్ నెంబర్‌కు లింక్ అయి ఉన్న బ్యాంకు అకౌంట్ పేరు డిస్ప్లే అవుతాయి. అయితే ఏఎస్ఏపీ మొబైల్ ఓటీపీ వెరిఫికేషన్‌తో ఈ సర్వీసును సురక్షితం చేయాలని యూజర్లు కోరుతారు. లేకపోతే బ్యాంకు అకౌంట్ వివరాలు దుర్వినియోగమయ్యే అవకాశాలున్నాయని ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. పైన ప్రక్రియలో ఎక్కడా కూడా ఓటీపీ కానీ, రిజిస్ట్రర్ మొబైల్ నెంబర్ కానీ అవసరం లేదు. దీంతోనే ఎవరి బ్యాంకు వివరాలైనా ఎవరైనా తెలుసుకునే అవకాశముంటోంది. బ్యాంక్‌తో లింక్ అయి ఉన్న సమాచారం ఎవరైనా చెక్ చేస్తున్నారో తెలిపే విధానం కూడా లేదు. -
కోట్లాది ఆధార్, బ్యాంక్ నంబర్ల లీక్, షాకింగ్ రిపోర్టు
ఆధార్ కార్డుల లీక్‌కు సంబంధించి మరోషాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఆధార్ డేటా లీక్ అయ్యే ఛాన్సే లేదని పదే పదే కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తున్నప్పటికీ తాజా పరిశోధన భద్రతా వ్యవస్థలోని డొల్లతనాన్ని బయటటపెట్టింది. జార్హండ్ లీక్ వ్యవహారం మర్చిపోకముందే ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా మరోభారీ లీకేజీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సుమారు 14కోట్లు (13కోట్ల 5లక్షల) ఆధార్‌కార్డులు, పదికోట్లకు పైగా బ్యాంకు ఖాతాల సమాచారం లీక్‌అయిందని తాజా రిపోర్ట్ వెల్లడించింది. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపింది. సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ సోమవారం విడుదల చేసిన కొత్త పరిశోధనా నివేదిక ప్రకారం కేంద్ర మంత్రిత్వశాఖ మరియు రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతారహిత సమాచార భద్రతా పద్దతుల ద్వారా 135 మిలియన్ల ఆధార్ నంబర్లు లీక్ అయ్యాయి. వివిధ రకాల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల అక్రమ భద్రతా పద్ధతుల కారణంగా గత రెండు నెలల్లో భారీగా డేటా బహిర్గతమైందని తెలిపింది. నాలుగు ప్రభుత్వ డేటాబేస్లను ఇది అధ్యయనం చేసింది. మొదటి రెండు గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందినవి. నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ (ఎన్ ఎస్ ఎ పి) డాష్‌బోర్డు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎన్.ఆర్.ఇ.జి.ఎ) పోర్టల్. మిగిలిన రెండు డేటాబేస్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్నానికి చెందినవి. రాష్ట్ర ప్రభుత్వ సొంత ఎన్ఆర్ఇజిఎ పోర్టల్ , రాష్ట్ర ప్రభుత్వ పథకానికి సంబంధించిన ఆన్లైన్ డాష్ బోర్డ్ "చంద్రన్న బీమా" ది. ఈనాలుగు పోర్టల్స్ దవ్ఆరా 130-135 మిలియన్లదాకా ఉండొచ్చని అంచనా వేసింది. అలాగే వంద మిలియన్లు(కోటి) దాకా బ్యాంక్ ఖాతా నెంబర్లు బహిర్గతమయ్యాయని అధ్యయన వేత్తలు అంబర్ సిన్హా , కొడాలి శ్రీనివాస్ తెలిపారు. ఈ డేటా లీక్ లో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) పాత్రపై విశేషంగా ప్రస్తావించారు. ప్రభుత్వ సంస్థల ప్రామాణికతలేని విధానాలు, భద్రత , గోప్యతకు భరోసా ఇవ్వడంలో బాధ్యతా రాహిత్యం దీనికి కారణమని వాదించారు. దీంతో ఈ డేటా దుర్వినియాగానికి దారి తీయనుందని నివేదిక పేర్కొంది. ఈ ప్రభుత్వ డేటాబేస్ ఇప్పటికీ డేటా లీక్ ను అరికట్టిందా లేదా అనేది కీలకమైన ప్రశ్నఅని చెప్పింది. అయిదే తమ పరిశోధన కొనసాగుతుడగా పిఐఐ (వ్యక్తిగతంగా గుర్తించదగిన సమాచారం) కి కొంత భద్రత కల్పించినట్టు గమనించామన్నారు. ఇటీవల ఆధార్ లీక్ లపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో డేటాబేస్ సంస్థలు స్పందిచినట్టు చెప్పింది. కాగా ఇటీవల జార్ఖండ్ ప్రభుత్వ విభాగ వెబ్సైట్లో లక్షలాది మంది పెన్షన్ లబ్ధిదారుల ఆధార్, మొబైల్ నంబర్లు, బ్యాంకు ఖాతా వివరాలు వెల్లడైన నేపథ్యంలో కేంద్రం స్పందించింది. రాష్ట్రప్రభుత్వాలకు చెందిన పలు ప్రభుత్వవిభాగాల వెబ్సైట్లలో లబ్ధిదారుల ఆధార్ కార్డు, వ్యక్తిగత వివరాలు బహిర్గతమైతే కఠిన చర్యలు తప్పవని రాష్ట్రాలను హెచ్చరించింది. అంతేకాదు మూడేళ్ల జైలు శిక్ష తప్పదని తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. -
‘ఆధార్ ’ వివరాల వెల్లడిపై కేంద్రం ఆగ్రహం
న్యూఢిల్లీ: రాష్ట్రప్రభుత్వాలకు చెందిన పలు ప్రభుత్వవిభాగాల వెబ్సైట్లలో లబ్ధిదారుల ఆధార్ కార్డు, వ్యక్తిగత వివరాలు బహిర్గతమైతే కఠిన చర్యలు తప్పవని రాష్ట్రాలను కేంద్రం హెచ్చరించింది. ఆయా వెబ్సైట్లలో ఆధార్ నంబర్లు, బ్యాంక్ ఖాతా వివరాలు బయటకు రాకుండా నివారణ చర్యలు చేపట్టేందుకు పునఃసమీక్ష చేయాలని రాష్ట్రప్రభుత్వాలను కేంద్ర ఐటీ శాఖ ఆదేశించింది. సమాచారం బహిర్గతమైతే చట్టాల ప్రకారం మూడేళ్ల జైలు శిక్ష తప్పదు. జార్ఖండ్ ప్రభుత్వ విభాగ వెబ్సైట్లో లక్షలాది మంది పెన్షన్ లబ్ధిదారుల ఆధార్, మొబైల్ నంబర్లు, బ్యాంకు ఖాతా వివరాలు వెల్లడైన నేపథ్యంలో కేంద్రం స్పందించింది.