‘ఆధార్ ’ వివరాల వెల్లడిపై కేంద్రం ఆగ్రహం
న్యూఢిల్లీ: రాష్ట్రప్రభుత్వాలకు చెందిన పలు ప్రభుత్వవిభాగాల వెబ్‌సైట్లలో లబ్ధిదారుల ఆధార్ కార్డు, వ్యక్తిగత వివరాలు బహిర్గతమైతే కఠిన చర్యలు తప్పవని రాష్ట్రాలను కేంద్రం హెచ్చరించింది.
ఆయా వెబ్‌సైట్లలో ఆధార్ నంబర్లు, బ్యాంక్ ఖాతా వివరాలు బయటకు రాకుండా నివారణ చర్యలు చేపట్టేందుకు పునఃసమీక్ష చేయాలని రాష్ట్రప్రభుత్వాలను కేంద్ర ఐటీ శాఖ ఆదేశించింది. సమాచారం బహిర్గతమైతే చట్టాల ప్రకారం మూడేళ్ల జైలు శిక్ష తప్పదు. జార్ఖండ్ ప్రభుత్వ విభాగ వెబ్‌సైట్‌లో లక్షలాది మంది పెన్షన్ లబ్ధిదారుల ఆధార్, మొబైల్ నంబర్లు, బ్యాంకు ఖాతా వివరాలు వెల్లడైన నేపథ్యంలో కేంద్రం స్పందించింది.