ముంబై: భారత్‌కు చెందిన అతి పెద్ద సర్జికల్ ఉత్పత్తుల కంపెనీ హెల్తీయమ్ మెడ్‌టెక్(గతంలో స్యూటూర్స్ ఇండియా)ను బ్రిటిష్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ, అపాక్స్ పార్ట్‌నర్స్ కొనుగోలు చేసింది. డీల్ విలువ దాదాపు రూ.2,000 కోట్లు. హెల్త్‌కేర్ రంగంలో అపాక్స్‌కు ఇది రెండో లావాదేవీ. 2007లో ఈ పీఈ సంస్థ, అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజెస్‌లో హెల్త్‌కేర్ రంగంలో తొలి పెట్టుబడి పెట్టింది.
కాగా ఈ పీఈ సంస్థకు భారత్‌లో ఇది ఎనిమిదో ఇన్వెస్ట్‌మెంట్. ఈ కంపెనీ ఇప్పటి వరకూ వివిధ భారత కంపెనీల్లో 200 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు పెట్టింది. ఐగేట్, జెన్‌సర్ టెక్నాలజీస్, శ్రీరామ్ సిటీ యూనియన్, చోళమండలం ఫైనాన్స్ కంపెనీల్లో ఈ సంస్థ పెట్టుబడులు పెట్టింది. ఇతర పీఈ సంస్థలు భారత కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి నష్టపోతుండగా, ఈ పీఈ సంస్థ మాత్రం మంచి లాభాలు సాధించడం విశేషం.
భారత కంపెనీల్లో పెట్టుబడుల ద్వారా ఈ పీఈ సంస్థ 250 కోట్ల డాలర్ల మేర రాబడులు పొందింది. అమెరికా తర్వాత ఈ సంస్థ అధికంగా పెట్టుబడులు పెడుతోంది భారత్‌లోనే. భారత్‌లో ప్రవేశించి గత ఏడాదికి పదేళ్లు దాటిన ఈ సంస్థ.. రానున్న నాలుగేళ్లలో భారత్‌లో వంద కోట్ల డాలర్లు పెట్టుబడుల పెట్టాలని యోచిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment