ఆర్‌టీఏ ఎం–వాలెట్
ఆర్‌టీఏ ఎం–వాలెట్’ యాప్. దీన్ని తెలంగాణ ప్రభుత్వం రూపొందించింది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ జారీ చేసే ఆర్‌సీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి డాక్యుమెంట్లను ఈ యాప్‌లో డిజిటల్ రూపంలో దాచుకోవచ్చు. పోలీసులు వాహనాన్ని ఆపినప్పుడు యాప్ ఓపెన్ చేసి డాక్యుమెంట్లు చూపిస్తే సరిపోతుంది. ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఒకసారి డౌన్‌లోడ్ చేసుకుంటే... ఫోన్లో ఇంటర్నెట్ లేకున్నా డాక్యుమెంట్లు స్టోర్ అయి ఉంటాయి పోలీసులు అడిగినపుడు చూపించొచ్చు.
ప్రత్యేకతలు
♦ ఆర్‌సీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి డాక్యుమెంట్లను స్టోర్ చేసుకోవచ్చు.
♦ రిజిస్ట్రేషన్ నెంబర్‌తోపాటు చాసిస్ నెంబర్‌లోని చివరి ఐదు సంఖ్యలను ఎంటర్ చేస్తే మన ఆర్‌సీ వస్తుంది.
♦ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్, పుట్టిన తేదీ, ఆర్‌టీఏ కార్యాలయం వివరాలు ఎంటర్ చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ కనిపిస్తుంది.
♦ అయితే ఈ యాప్ తెలంగాణలో మాత్రమే పనిచేస్తుంది. ఇక్కడ రిజిస్టర్ అయిన వాహనాల సమాచారమే వస్తుంది. ఇక్కడి ఆర్‌టీఏ కార్యాలయాల్లో పొందిన డ్రైవింగ్ లైసెన్స్ వివరాలు మాత్రమే కనిపిస్తాయి. దేశంలో మీరు ఇతర ప్రాంతాలకు వెళ్లినపుడు అక్కడ కనక డ్రైవింగ్ చేస్తుంటే పోలీసులు ఆపొచ్చు. ఈ డిజిటల్ యాప్ చూపిస్తే చెల్లదని అనొచ్చు. కాబట్టి ఇతర ప్రాంతాలకు వెళ్లినపుడు లైసెన్స్, ఆర్‌సీలను భౌతిక రూపంలో క్యారీ చెయ్యటమే బెటర్.
Comments
Please login to add a commentAdd a comment