జియో ఆఫర్లపై ట్రాయ్ వివరణ కోరిన ట్రిబ్యునల్
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో ఆఫర్లు, టారిఫ్‌లకు సంబంధించిన మొత్తం అన్ని వివరాలను తమకందించాలని టెలికం ట్రిబ్యునల్ టీడీఎస్‌ఏటీ తాజాగా ట్రాయ్‌ని ఆదేశించింది. జియో ఉచిత ప్రమోషనల్ ఆఫర్ పొడిగింపునకు ట్రాయ్ అనుమతినివ్వడాన్ని సవాల్ చేస్తూ భారతీ ఎయిర్‌టెల్, ఐడియా సెల్యులర్ కంపెనీలు ఇదివరకే ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాయి.
ఇవే టెల్కోలు ఇటీవల జియో టారిఫ్‌లకు ట్రాయ్ క్లీన్‌చిట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ మళ్లీ ట్రిబ్యునల్ తలుపుతట్టాయి. ఎయిర్‌టెల్, ఐడియా ఫిర్యాదులను విచారణకు స్వీకరించిన ట్రిబ్యునల్ తాజాగా జియో ప్రవేశపెట్టిన వెల్‌కమ్ ఆఫర్, హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్‌లకు సంబంధించిన మొత్తం వివరాలను ఫిబ్రవరి 23లోగా తమకు అందించాలని ట్రాయ్‌ని ఆదేశించింది.