TDSAT
-
ఎస్సెమ్మెస్ ఆఫర్ లేకుంటే.. పోర్టబులిటీ అవకాశం ఇవ్వరా?
న్యూఢిల్లీ: టారిఫ్ ప్లాన్‌తో సంబంధం లేకుండా యూజర్లు నంబర్ పోర్టబిలిటీ కోసం ఎస్ఎంఎస్ పంపించే సౌలభ్యం కల్పిస్తూ ట్రాయ్ ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని టెలికం ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. దీనికి సంబంధించి టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. అయితే, యూజర్లు అందరికీ ఆదేశాలను అమలు చేయడానికి వొడాఫోన్ ఐడియాకు సముచిత సమయం ఇవ్వాలని ట్రాయ్‌కు సూచించింది. వేరే ఆపరేటర్‌కు మారాలనుకునే యూజర్లకు టెలికం కంపెనీలు తప్పనిసరిగా పోర్టింగ్ కోసం ఎస్ఎంఎస్ను పంపే సౌలభ్యం కల్పించాలంటూ టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ 2021 డిసెంబర్లో ఆదేశించింది. టారిఫ్ ఆఫర్లు, వోచర్లు, ప్లాన్లతో దీన్ని ముడిపెట్టరాదని సూచించింది. కొన్ని ప్లాన్లలో ఎస్ఎంఎస్ సదుపాయం లేదనే సాకుతో నిర్దిష్ట టెల్కోలు.. నంబర్ పోర్టబిలిటీ కోసం సంక్షిప్త సందేశాలు పంపనివ్వకుండా తిరస్కరిస్తున్న నేపథ్యంలో ట్రాయ్ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. దీనిపై వొడాఫోన్ ఐడియా.. టీడీశాట్‌ను ఆశ్రయించింది. ఒక యూజరు .. ఎస్ఎంఎస్ లేని ప్యాక్‌ను ఎంచుకున్నారంటేనే వారు పోర్టింగ్ హక్కులను వదులుకున్నట్లుగా భావించాల్సి ఉంటుందని వాదించింది. కానీ వీటిని టీడీశాట్ తోసిపుచ్చింది. అయితే, పోర్టబిలిటీ కోసం పంపే ఇలాంటి ఎస్ఎంఎస్లను ఉచితం చేయకుండా, ఎంతో కొంత చార్జీలు వర్తింపచేసేలా ట్రాయ్ తగు వివరణ జారీ చేయాలని పేర్కొంది. చదవండి: పూర్తి స్థాయి డిజిటల్ బ్యాంకుగా ఎస్బీఐ యోనో యాప్..! -
GST Tax Payers: సెప్టెంబరు 10లోగా టీడీఎస్ దాఖలు చేయండి
న్యూఢిల్లీ : పన్ను చెల్లింపుదారులను ఉద్దేశించి కేంద్ర ఆర్థిక శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. ఆగస్టుకి సంబంధించి జీఎస్టీ నుంచి డిడక్ట్ ట్యాక్స్ అట్ సోర్స్ (టీడీఎస్) మినహాయింపు పొందాలని ఆశించే వారు సెప్టెంబరు 10లోగా జీఎస్టీఆర్- 7 ఫామ్‌ని దాఖలు చేయాలని కోరింది. టీడీఎస్ మినహాయింపుకు మరో మూడు రోజుల సమయమే ఉందని చెప్పింది. నిర్దేశిత గడువులోగా జీఎస్టీ ఫామ్ 7ను దాఖలు చేయాలని లేదంటే ఆలస్య రుసుముతో పాటు వడ్డీని కూడా చెల్లించాల్సి ఉంటుందని సూచించింది. Attention GST Taxpayers who are required to deduct Tax at Source (TDS) under GST! File your GSTR-7 Return for the month of August, 2021 by September 10th, 2021. pic.twitter.com/6XmfZuRkDq— CBIC (@cbic_india) September 8, 2021 చదవండి: ప్రత్యేక ఆర్థిక జోన్లకూ పన్ను రిఫండ్ పథకం? -
జియో ఫ్రీ-ఆఫర్లపై విచారణ ఆ రోజే
ముంబై : రిలయన్స్ జియో ఉచిత ఆఫర్లను కొనసాగించడానికి ట్రాయ్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భారతీ ఎయిర్టెల్, ఐడియా సెల్యులార్ టెలికాం ట్రిబ్యూనల్‌ను ఆశ్రయించిన సంగతి తెలిసింది. ఈ కేసు విచారణను టెలికాం ట్రిబ్యూనల్(టీడీశాట్) ఆగస్టు 18న చేపట్టనున్నట్టు తెలిపింది. 90 రోజులకు మించి ఉచిత ఆఫర్లు కొనసాగించడానికి ట్రాయ్, రిలయన్స్ జియోకు అనుమతించింది. కానీ, జియో తీసుకొచ్చిన వెల్కం ఆఫర్, హ్యాపీ న్యూఇయర్ ఆఫర్లు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని భారతీ ఎయిర్టెల్, ఐడియాలు ఆరోపించాయి. ప్రస్తుతం ఆ ఆఫర్ల గడువు ముగిసిపోయింది. ఈ ఆఫర్ల కొనసాగించుకోవడానికి జియోకు ట్రాయ్ ఇచ్చిన ఆర్డర్‌కు వ్యతిరేకంగా టెలికాం దిగ్గజాలు టెలికాం ట్రిబ్యూనల్‌లో ఫిర్యాదు చేశాయి. నేడు ఈ కేసు విచారణకు వచ్చింది. అయితే రిలయన్స్ జియో ఇచ్చిన సమాధానానికి తమ స్పందన తెలియజేయడానికి కొంత సమయం కావాలని టెలికాం దిగ్గజాలు కోరాయి. ఈ నేపథ్యంలో టీడీశాట్ ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు 18న చేపట్టనున్నట్టు పేర్కొంది. గతేడాది సెప్టెంబర్‌లో జియో ఉచిత వాయిస్, డేటా ప్లాన్లతో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి ఈ ఏడాది మార్చి వరకు ఉచిత ఆఫర్లు కొనసాగిస్తూ ఉంది. 90 రోజుల మించి ఈ ఉచిత ఆఫర్లు కొనసాగించడంపై టెలికాం దిగ్గజాలు మండిపడ్డాయి. అయితే దీనికి టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ కూడా అనుమతి ఇవ్వడంతో, భారతీ ఎయిర్టెల్, ఐడియాలు టెలికాం ట్రిబ్యూనల్‌ను ఆశ్రయించాయి. కాగ, ఏప్రిల్ 1 నుంచి జియో టారిఫ్ ప్లాన్లను అమలుచేస్తోంది. -
జియో ఉచిత ఆఫర్లు కొనసాగుతాయ్!
న్యూఢిల్లీ : రిలయన్స్ జియో అందించే ఉచిత ఆఫర్లపై స్టే విధించడానికి టెలికాం ట్రిబ్యునల్ నిరాకరించింది. జియో ఉచిత సేవల నిలిపివేతకు నిరాకరించిన టెలికాం డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అండ్ అప్పీలెట్ ట్రిబ్యునల్(టీడీశాట్), అయితే ఆ ఆఫర్లను కొనసాగించుకునేలా ఆపరేటర్ కు ఇచ్చిన జనవరి 31 నాటి అనుమతిని పునఃపరిశీలించాలని ట్రాయ్ ను ఆదేశించింది. రెండు వారాల్లో దీనిపై ఓ నివేదికను తమకు అందించాలని ట్రాయ్ కి టీడీశాట్ ఆదేశాలు జారీచేసింది. రిలయన్స్ జియో అందిస్తున్న ఉచిత ఆఫర్లపై స్టే విధించాలని కోరుతూ టెలికాం కంపెనీలు వేసిన మధ్యంతర అప్పీల్ పై ఆదేశాలను టీడీశాట్ రిజర్వులో పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం జియో అందిస్తున్న ఉచిత ఆఫర్లు కొనసాగేలా, ఆఫర్లపై స్టే విధించడానికి టీడీశాట్ నిరాకరించింది. గతేడాది సెప్టెంబర్ నుంచి జియో ఉచిత వాయిస్, డేటా ప్లాన్ ను కస్టమర్లకు అందిస్తోంది. డిసెంబర్ లో మళ్లీ తమ ఉచిత సర్వీసులను 2017 మార్చి 31 వరకు పొడిగించింది. దీనిపై ఆగ్రహించిన టెలికాం కంపెనీలు ట్రాయ్ కు వ్యతిరేకంగా టీడీశాట్ ను ఆశ్రయించాయి. జియో ఉచిత కాలింగ్, డేటా ప్లాన్ నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయని, ఎలాంటి ఉల్లంఘన కంపెనీ చేయడం లేదని రెగ్యులేటరీ ట్రాయ్ క్లీన్ చీట్ ఇచ్చింది. జియో వెల్ కమ్ ఆఫర్ కు, హ్యాపీ న్యూఇయర్ ఆఫర్ కు తేడా ఉందని ట్రాయ్ పేర్కొంది. -
జియో ఆఫర్లపై ట్రాయ్ వివరణ కోరిన ట్రిబ్యునల్
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో ఆఫర్లు, టారిఫ్‌లకు సంబంధించిన మొత్తం అన్ని వివరాలను తమకందించాలని టెలికం ట్రిబ్యునల్ టీడీఎస్ఏటీ తాజాగా ట్రాయ్‌ని ఆదేశించింది. జియో ఉచిత ప్రమోషనల్ ఆఫర్ పొడిగింపునకు ట్రాయ్ అనుమతినివ్వడాన్ని సవాల్ చేస్తూ భారతీ ఎయిర్టెల్, ఐడియా సెల్యులర్ కంపెనీలు ఇదివరకే ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాయి. ఇవే టెల్కోలు ఇటీవల జియో టారిఫ్‌లకు ట్రాయ్ క్లీన్చిట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ మళ్లీ ట్రిబ్యునల్ తలుపుతట్టాయి. ఎయిర్టెల్, ఐడియా ఫిర్యాదులను విచారణకు స్వీకరించిన ట్రిబ్యునల్ తాజాగా జియో ప్రవేశపెట్టిన వెల్కమ్ ఆఫర్, హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్లకు సంబంధించిన మొత్తం వివరాలను ఫిబ్రవరి 23లోగా తమకు అందించాలని ట్రాయ్‌ని ఆదేశించింది. -
జియో 'హ్యాపీ న్యూయర్'కి మరో ట్రబుల్...
ముంబై : టెలికాం సంస్థ రిలయన్స్ జియో ఆఫర్ చేస్తున్న హ్యాపీ న్యూయర్ టారిఫ్ ప్లాన్లకు మరో చిక్కు వచ్చి పడింది. హ్యాపీ న్యూయర్ ఆఫర్ కింద జియో అందిస్తున్న సేవలు నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయంటూ క్లీన్ చీట్ ఇచ్చిన వెంటనే ట్రాయ్‌పై టెలికాం దిగ్గజాలు ఎయిర్టెల్, ఐడియా సెల్యులార్‌లు పోరాటానికి దిగాయి. టెలికాం డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అండ్ అప్పీలెంట్ ట్రిబ్యునల్(టీడీశాట్) వద్ద ట్రాయ్‌పై ఫిర్యాదు దాఖలు చేశాయి. టెలికాం దిగ్గజాల ఫిర్యాదు మేరకు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ అందిస్తున్న ఉచిత వాయిస్, డేటా సర్వీసులపై వివరణ ఇవ్వాలని ట్రిబ్యునల్, రెగ్యులేటరీని ఆదేశించింది. జియో ప్రకటించిన వెల్ కమ్ ఆఫర్, హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్.. రెండూ వేర్వేరు అని ట్రాయ్ గతవారమే తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. అయితే అవి ఎలా వేర్వేరో తెలుపుతూ ఫిబ్రవరి 15లోపు క్లారిఫికేషన్ ఇవ్వాలని ట్రాయ్‌ని ట్రిబ్యునల్ ఆదేశించింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 20కు వాయిదా వేసింది. టీడీశాట్ వద్ద ఫిర్యాదు దాఖలు చేసిన ఎయిర్టెల్, ఐడియాలు ఉచిత కాల్స్, డేటా సర్వీసులు అందిస్తున్న ప్రమోషనల్ ఆఫర్‌నే పేరు మార్చి వినియోగదారులకు అందించడానికి జియోకు రెగ్యులేటరీ అనుమతించిందని ఆరోపిస్తున్నాయి. నిర్దేశిత 90 రోజులను కూడా అధిగమించి జియో 2017 మార్చి దాకా ఉచిత వాయిస్, డేటా ఆఫర్లను అందించడం నిబంధనలకు విరుద్ధమంటూ పేర్కొన్నాయి. ట్రాయ్ టెలికాం టారిఫ్ ఆర్డర్లను జియో ఉల్లంఘిస్తుందని చెప్పాయి. -
3జీ రోమింగ్ ఒప్పందాలకు ఓకే
న్యూఢిల్లీ: దేశంలో అగ్రగామి టెలికం కంపెనీలైన ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియాలకు ఊరట లభించింది. 3జీ రోమింగ్ ఒప్పందాలపై టెలికం శాఖ(డాట్) విధించిన నిషేధం చెల్లదని టెలికం ట్రిబ్యునల్ టీడీశాట్ తేల్చిచెల్పింది. అంతేకాదు నిబంధనలకు విరుద్ధంగా 3జీ రోమింగ్ ఒప్పందాలు కుదుర్చుకున్నారంటూ డాట్ వడ్డించిన రూ.1,200 కోట్ల జరిమానాను కూడా రద్దుచేస్తూ మంగళవారం టీడీశాట్ తీర్పిచ్చింది. 2010లో టెల్కోలు 3జీ స్పెక్ట్రంను కొనుగోలు చేయడం, ఆతర్వాత తమకు స్పెక్ట్రం లెసైన్స్‌లేని సర్కిళ్లలో ఇతర టెల్కోలతో ఇంట్రా సర్కిల్ రోమింగ్(ఐసీఆర్) ఒప్పందాల ద్వారా 3జీ సేవలను అందించడం తెలిసిందే. కంపెనీలు స్పెక్ట్రంను కొనుగోలు చేయకుండా సేవలందించడం వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడిందని ఆరోపిస్తూ డాట్ ఈ నిషేధం, జరిమానాలను విధించింది. దీంతో తమకు స్పెక్ట్రం లేని సర్కిళ్లలో 3జీ సేవలను ఈ మూడు టెల్కోలూ నిలిపేయాల్సి వచ్చింది. డాట్ ఆదేశాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఆయా కంపెనీలు టీడీశాట్‌ను ఆశ్రయించాయి. ఒప్పందాలు సహేతుకమే.... స్పెక్ట్రం కొరత నేపథ్యంలో మెరుగ్గా ఈ సహజవనరులను ఉపయోగించుకోవడం కోసం జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రోమింగ్ ఒప్పందాలకు అనుమతించవచ్చని టీడీశాట్ పేర్కొంది. స్పెక్ట్రంను తగినవిధంగా సద్వినియోగం చేసుకోవడానికి ఇటువంటి ఒప్పందాలు దోహదం చేస్తాయని, తద్వారా వినియోగదారులకు కూడా ప్రయోజనకరమేనని టీడీశాట్ చైర్మన్ జస్టిస్ అఫ్తాబ్ ఆలం నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. ‘ఐసీఆర్ 3జీ రోమింగ్ ఒప్పందాల్లో టెల్కోలు లెసైన్స్ నిబంధనలను ఉల్లంఘించాయని మేం భావించడం లేదు. పరస్పర ఒప్పందాల ద్వారా 3జీ సేవలను అందించకుండా డాట్ నిలువరించడం కుదరదు. భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియాలకు డాట్ ఇచ్చిన నిషేధ, జరిమానా ఆదేశాల కొట్టివేస్తున్నాం’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. కాగా ఎయిర్‌సెల్, టాటా టెలీ కంపెనీలకు డాట్ ఇచ్చిన ఆదేశాలను కూడా కొట్టివేస్తున్నట్లు ట్రిబ్యునల్ పేర్కొంది. ఇదిలాఉండగా.. టీడీశాట్ తీర్పుపై సుప్రీంకోర్టును డాట్ ఆశ్రయించనుందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఒప్పందాలు ఇలా... 2010లో నిర్వహించిన 3జీ వేలంలో ఎయిర్టెల్... 13 సర్కిళ్లలో రూ.12,295 కోట్లకు స్పెక్ట్రం కొనుగోలు చేసింది. ఇక వొడాఫోన్ 11 సర్కిళ్లు(రూ.11,617 కోట్లు), ఐడియా 11 సర్కిళ్లలో(రూ.5,769 కోట్లు) 3జీ స్పెక్ట్రం దక్కించుకున్నాయి. అయితే, ఎయిర్టెల్.. వొడాఫోన్తో ఒప్పందం ద్వారా ఆ కంపెనీ సర్కిళ్లలోని మహారాష్ట్ర, కోల్‌కతా, హర్యానా, ఉత్తరప్రదేశ్ ఈస్ట్లలో సేవలను ప్రారంభించింది. వొడాఫోన్.. ఎయిర్‌టెల్‌కు చెందిన అసోం, బీహార్, కర్ణాటక, ఈశాన్య భారత్, రాజస్థాన్, యూపీ వెస్ట్‌లతో సహా ఐడియా చేతిలో ఉన్న ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, కేరళ, మధ్యప్రదేశ్‌లలో ఒప్పందం కుదుర్చుకొని 3జీ సేవలకు తెరతీసింది. ఐడియా కూడా వొడాఫోన్‌కున్న ఢిల్లీ, తమిళనాడు, చెన్నై, కోల్‌కతా సర్కిళ్లను ఉపయోగించుకోవడానికి ఒప్పందం చేసుకుంది. అయితే, వీటిపై డాట్ ఆదేశాలతో రోమింగ్ ఒప్పందాలద్వారా ఇస్తున్న సేవలను నిలిపేయాల్సి వచ్చింది. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినప్పటికీ టెల్కోలకు ఊరట లభించలేదు. దీంతో సుప్రీంను ఆశ్రయించిన టెల్కోలు... కేసును టీడీశాట్‌కు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశాయి. ఇందుకు సుప్రీం కోర్టు గతేడాది సెప్టెంబర్‌లో అంగీకారించింది. కొత్త కస్టమర్లను చేర్చుకోవడంపై మాత్రం నిషేధం విధించింది. అంతిమంగా ఇప్పుడు టీడీశాట్‌లో ఈ మూడు టెల్కోలకు అనుకూలంగా తీర్పు వెలువడింది.