ముంబై: నినాదాలు, ప్రజాకర్షణలు ఆర్థిక విధానాలను నడిపించలేవని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఆర్థిక విధానాలపై వాస్తవాలు, పూర్తి సమాచారం ఆధారంగా తగిన చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. మనీకంట్రోల్ సంస్థ నిర్వహించిన వెల్త్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా జైట్లీ మాట్లాడారు.
దేశంలో నాణ్యమైన చర్చలు కొరవడ్డాయన్న ఆయన, ముఖ్యంగా ఆర్థిక అంశాలపై ఆరోగ్యకరమైన చర్చ జరిగేలా జాతీయ స్థాయిలో ప్రయత్నం జరగాలన్నారు. కేవలం ప్రకటనలపైనే దృష్టి పెడుతున్నామని, దీనికి బదులు ఉత్పాదకత పెంపుపై దృష్టి సారించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment