మార్కెట్ వాటా తిరిగి పెంచుకుంటాం.. | Ashok Leyland LCV President Nitin | Sakshi
Sakshi News home page

మార్కెట్ వాటా తిరిగి పెంచుకుంటాం..

Published Tue, Jul 21 2015 11:44 PM | Last Updated on Sun, Sep 3 2017 5:54 AM

మార్కెట్ వాటా తిరిగి పెంచుకుంటాం..

మార్కెట్ వాటా తిరిగి పెంచుకుంటాం..

♦ మరిన్ని వేరియంట్లు తీసుకొస్తాం
♦ అశోక్ లేలాండ్ ఎల్‌సీవీ ప్రెసిడెంట్ నితిన్
 
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : తేలికపాటి వాణిజ్య వాహన (ఎల్‌సీవీ) విభాగంలో దేశీయంగా మార్కెట్ వాటాను తిరిగి పెంచుకుంటామని అశోక్ లేలాండ్ తెలిపింది. భారత ఎల్‌సీవీ విపణిలో 2012-13లో కంపెనీకి 18 శాతం వాటా ఉండేది. ఆ తర్వాతి సంవత్సరానికి ఇది 14 శాతానికి చేరింది. ఏటా 1.9 లక్షల యూనిట్లు విక్రయమవుతున్న ఈ విభాగంలో ప్రస్తుతం సంస్థకు 16 శాతం వాటా ఉంది. ఎల్‌సీవీ అయిన దోస్త్, మినీ ట్రక్-పార్టనర్, మినీ బస్-మిత్ ్రప్లాట్‌ఫాంపై మరిన్ని మోడళ్లను తీసుకురావడం ద్వారా తిరిగి వాటాను చేజిక్కించుకుంటామని కంపెనీ ఎల్‌సీవీ, డిఫెన్స్ విభాగం ప్రెసిడెంట్ నితిన్ సేథ్ మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు.

మార్కెట్ మళ్లీ పుంజుకుంటోందని చెప్పారు. ‘మూడేళ్లలో 1 లక్ష దోస్త్ వాహనాలను కంపెనీ విక్రయించింది. మరో లక్ష దోస్త్ వాహనాలను రెండున్నరేళ్లలోనే అమ్మాలన్నది లక్ష్యం. ఇక మినీ స్కూల్ బస్‌ల విభాగంలో అపార అవకాశాలున్నాయి. మిత్ ్రప్లాట్‌ఫామ్ ద్వారా ఈ విభాగంలో పట్టు సాధిస్తాం. భారత ప్రభుత్వం నిర్దేశించిన భద్రత ప్రమాణాలకు తగ్గట్టుగా ఈ వాహనం డిజైన్ చేశాం’ అని తెలిపారు. త్వరలో 32, 36, 40 సీట్ల సామర్థ్యంతో ఏసీ బస్‌లను మిత్ ్రప్లాట్‌ఫాంపై తీసుకొస్తామని వెల్లడించారు. పాఠశాల బస్‌ల నూతన భద్రత ప్రమాణాలు ఆగస్టు 1 నుంచి అమలులోకి రానున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement