హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అరబిందో ఫార్మా నికర లాభం 2017–18 నాలుగో త్రైమాసిక కాలంలో స్వల్పంగా తగ్గింది. 2016–17 క్యూ4లో రూ.533 కోట్లుగా ఉన్న నికర లాభం తాజా క్యూ4లో రూ.529 కోట్లకు తగ్గింది. ఆదాయం మాత్రం రూ.3,642 కోట్ల నుంచి రూ.4,049 కోట్లకు పెరిగిందని అరబిందో ఫార్మా తెలిపింది.
ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17లో రూ.2,302 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 5 శాతం వృద్ధితో రూ.2,423 కోట్లకు పెరిగింది. ఆదాయం రూ.15,090 కోట్ల నుంచి రూ.16,500 కోట్లకు ఎగసిందని కంపెనీ తెలియజేసింది. గత ఆర్థిక సంవత్సరం ఆదాయం, లాభదాయకతల్లో ఆరోగ్యకరమైన వృద్ధినే సాధించామని కంపెనీ పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో అరబిందో ఫార్మా షేర్ 1.8% లాభంతో రూ.605 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment