రూ. వెయ్యికి మించిన బ్రాండెడ్ వస్త్రాలపై ఎక్సైజ్ పన్నును ‘ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ లేకుండా 2 శాతానికి, ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్‌తో 12.5 శాతానికి’ పెంచనున్నట్లు జైట్లీ బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ఈ పన్ను ప్రస్తుతం ‘ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ లేకుంటే పూర్తి మినహాయింపు, ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్‌తో 6 శాతం నుంచి 12 వరకు’ ఉంది.
అయితే తాజా పెంపు ప్రతిపాదన అమల్లోకి వస్తే వస్త్రాల ధరలు రెండు శాతం నుంచి ఐదు శాతం వరకు పెరగవచ్చని వస్త్ర పరిశ్రమ ప్రతినిధులు పేర్కొన్నారు. పెద్ద పెద్ద బ్రాండెడ్ సంస్థలకు వస్త్రాలు తయారుచేసి ఇచ్చే చిన్న, మధ్యతరహా వస్త్ర పరిశ్రమలకు ఇది దెబ్బేనని చెప్పారు.