బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (ఫైల్ ఫోటో)
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర దేశవ్యాప్తంగా తనకున్న 51 బ్రాంచులను మూసివేస్తోంది. బ్యాంకింగ్ పరిశ్రమలో అమలు చేస్తున్న వ్యయ కోత చర్యల్లో భాగంగా తమ 51 బ్రాంచులను మూసివేస్తున్నట్టు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అధికారులు చెప్పారు. మూసివేసే అన్ని బ్రాంచులు కూడా పట్టణ సెంటర్లకు చెందినవే. భారీ నష్టాలు సంభవిస్తూ.. అసమర్థంగా పడి ఉన్న బ్రాంచులను తాము గుర్తించామని అధికారులు పేర్కొన్నారు. 51 బ్రాంచుల్లో కొన్నింటిన్నీ పూర్తిగా మూసివేస్తుండగా.. కొన్నింటిన్నీ పక్క బ్రాంచుల్లో విలీనం చేస్తున్నారు. ప్రజా సౌలభ్యం కోసమే ఈ బ్రాంచులను మూసివేయడం, విలీనం చేయడం చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ బ్రాంచుల ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్, ఎంఐసీఆర్ కోడ్ లను కూడా రద్దు చేశారు అధికారులు.
అన్ని సేవింగ్స్ అకౌంట్లను, కరెంట్ అకౌంట్లను, ఇతర బ్యాంక్ అకౌంట్లను విలీనం చేసిన బ్రాంచులకు బదిలీ చేశామని అధికారులు తెలిపారు. నవంబర్ 30 వరకు కస్టమర్లందరూ పాత ఐఎఫ్‌ఎస్‌సీ/ఎంఐసీఆర్ కోడ్‌లతో ఉన్న తమ చెక్-బుక్‌లను మూత పడే బ్రాంచులు వద్ద డిపాజిట్ చేయాలని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఆదేశించింది. కొత్త బ్రాంచుల వద్ద ఐఎఫ్‌ఎస్‌సీ/ఎంఐసీఆర్ కోడ్‌లతో ఉన్న తమ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్లను సేకరించుకోవాలని చెప్పింది. డిసెంబర్ 31 నుంచి శాశ్వతంగా పాత ఐఎఫ్‌ఎస్‌సీ/ఎంఐసీఆర్ కోడ్‌లను రద్దు చేయనుంది. ఇక అప్పటి నుంచి బ్యాంక్ లావాదేవీలన్నీ కొత్త ఐఎఫ్‌ఎస్‌సీ/ఎంఐసీఆర్ కోడ్‌లతోనే జరగాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment