Bank Of Maharashtra: ఒక వ్యక్తి తన జీవిత కాలంలో ఏదో ఒక సందర్భంలో అప్పు చేయక తప్పదు. తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు చేస్తే వడ్డీల మీద వడ్డీలు కట్టి అమాంతం మునిగిపోతారు. బ్యాంకుల వద్ద తీసుకోవాలంటే ప్రాసెసింగ్ ఫీజులు, వడ్డీ అంటూ ఎన్నెన్నో వసూలు చేస్తారు. అయితే అలాంటి ఇబ్బందులకు చెక్ పెడుతూ ఒక బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఖాతాదారులు తీసుకునే లోన్ మీద ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు మాఫీ చేస్తున్నట్లు తెలిపింది. అంతే కాకుండా వడ్డీ రేటుని కూడా భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అకౌంట్ హోల్డర్ల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇప్పుడు హౌస్ అండ్ కార్ లోన్ వడ్డీ రేటుని 0.20 శాతం తగ్గించింది. దీంతో పాటు ప్రాసెసింగ్ ఫీజు కూడా పూర్తిగా మాఫీ చేసింది. దీంతో కారు లోన్ 8.90 శాతం నుంచి 8.70 శాతానికి చేరింది. హౌస్ లోన్ వడ్డీ రేటు 8.60 శాతం నుంచి 8.50 శాతానికి (0.10 శాతం తగ్గింపు) చేరింది.
ఇదీ చదవండి: ఆరుపదుల వయసులో రూ. 23,000కోట్ల అధిపతిగా.. ఎవరీ లచ్మన్ దాస్ మిట్టల్
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కొత్త రూల్స్ 2023 ఆగష్టు 14 నుంచి అమలులో ఉంటాయని తెలుస్తోంది. తక్కువ వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజుల మినహాయింపు కస్టమర్లతో కొత్త ఉత్సాహాన్ని నింపడంలో సహాయపడింది. అంతే కాకూండా లోనే తీసుకునే వారి సంఖ్య కూడా దీని వల్ల పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment